‘సైరా’ సెట్లో అగ్ని ప్ర‌మాదం!


'సైరా' సెట్లో అగ్ని ప్ర‌మాదం!

‘సైరా’ సెట్లో అగ్ని ప్ర‌మాదం!

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న ‘సైరా’ సెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా.. న‌ర‌సింహారెడ్డి’. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ చంపెనీ ప‌తాకంపై హీరో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ సెట్‌ని చిరంజీవి ఫామ్ హౌజ్‌లో ఏర్పాటు చేశారు. ఈ సెట్‌లో శుక్ర‌వారం తెల్ల‌వారు జామున భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆ స‌మ‌యంలో సెట్‌లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. ఈ ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా కోకాపేట శివారులో చోటు చేసుకుంది. అగ్నిప్ర‌మాదాన్ని గ‌మ‌నించిన గ్రామస్థులు వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి ఫోన్ చేయ‌డంతో సిబ్బంది వ‌చ్చి మంట‌ల్ని అదుపు చేశారు.

షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే ప్ర‌మాదం చోటు చేసుకుని వుంటుంద‌ని అధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో రూ. 3 కోట్ల మేర ఆస్తి న‌ష్టం సంభ‌వించి వుండ‌వ‌చ్చిని చిత్ర బృందం అంచ‌నా వేస్తోంది.

ఈ ఘటనపై నిర్మాత రాంచరణ్ స్పందించారు. నిర్మాణ సంస్థ అధికారిక ట్విట్టర్ పేజీలో “దురదృష్టవశాత్తూ ఈ వేకువ జామున కోకాపేటలోని ‘సైరా’ సెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ బృందంలోని ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నారు. ఏ ఒక్కరూ గాయపడలేదు. సినిమా చివరి షెడ్యూల్‌ను పూర్తి చేయడం కోసం ఎదురు చూస్తున్నాం” అని ఆయన పోస్ట్ చేశారు.

‘సైరా’ సెట్లో అగ్ని ప్ర‌మాదం! | actioncutok.com

Trending now: