జూన్ 14న ‘గేమ్ ఓవర్’


జూన్ 14న ‘గేమ్ ఓవర్’

జూన్ 14న ‘గేమ్ ఓవర్’

ప్రముఖ కథానాయిక తాప్సీ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో  ప్రముఖ తెలుగు, తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ వై నాట్ స్థూడియోస్ నిర్మిస్తున్న చిత్రం  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ ను పొందింది.  ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14 న విడుదల అవుతోందని చిత్ర నిర్మాత లు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు.

గతంలో ఈ సంస్థ సిద్ధార్థ్ కథానాయకునిగా రూపొందిన ‘లవ్ ఫెయిల్యూర్’ (2012), వెంకటేష్ కథానాయకునిగా రూపొందిన ‘గురు’ (2017) వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు తమ మరో ప్రయత్నం గా తాప్సీ ప్రధాన పాత్రలో  ఈ ‘గేమ్ ఓవర్’ ను నిర్మించటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత ఎస్.శశికాంత్.

ఓ సరికొత్త కథ, కథనాలతో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన ఈ చిత్రం తమ గత చిత్రాలు  ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’ విజయాల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నయనతార కథానాయికగా తమిళ నాట ఘనవిజయం సాధించిన ‘మయూరి’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఈ ‘గేమ్ ఓవర్’  చిత్రం రూపొందింది.

కథానాయిక తాప్సీ మాట్లాడుతూ.. కథ విన్నప్పుడే ‘గేమ్ ఓవర్’ సరికొత్తగా ఉందని అనిపించింది. విజయం సాధించే చిత్రం అనిపించింది. ‘ఆనందో బ్రహ్మ’ తరువాత నా చిత్రాలపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రం వమ్ము చేయదు” అన్నారు.

దర్శకుడు అశ్విన్ శరవణన్ మాట్లాడుతూ… ‘గేమ్ ఓవర్’  చిత్రం తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని అన్నారు.

ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ , ఎడిటర్: రిచర్డ్ కెవిన్, రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్, మాటలు: వెంకట్ కాచర్ల, ఛాయా గ్రహణం: ఎ.వసంత్, ఆర్ట్: శివశంకర్ , కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.కె.నందిని, పోరాటాలు: ‘రియల్’ సతీష్, సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా), స్టిల్స్: ఎమ్.ఎస్.ఆనందం, పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న, పి.ఆర్.ఓ:  లక్ష్మి వేణుగోపాల్, వై నాట్ స్టూడియోస్ టీమ్: కంటెంట్ హెడ్: సుమన్ కుమార్, డిస్ట్రిబ్యూషన్ హెడ్:  కిషోర్ తాళ్లూరు, బిజినెస్ ఆపరేషన్స్: ప్రణవ్ రాజ్ కుమార్., ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్స్: రంగరాజ్, ప్రసాద్ సోములరెడ్డి.

జూన్ 14న ‘గేమ్ ఓవర్’ | actioncutok.com

More for you: