ర‌వితేజ‌తో హ్యాట్రిక్ కొడతాడా?


ర‌వితేజ‌తో హ్యాట్రిక్ కొడతాడా?
Gopichand Malineni

ర‌వితేజ‌తో హ్యాట్రిక్ కొడతాడా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కి క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల‌లో గోపీచంద్ మ‌లినేని ఒక‌డు. గ‌తంలో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘డాన్ శీను’, ‘బ‌లుపు’ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించాయి. క‌ట్ చేస్తే.. ఆరేళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో సినిమా రానుంద‌ని గ‌త కొంత‌కాలంగా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ కాంబినేష‌న్ మూవీ దాదాపు ఖాయ‌మైన‌న‌ట్లేని తెలిసింది. అంతేకాదు.. ప్ర‌ముఖ నిర్మాత ‘ఠాగూర్‌’ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానుంది.

ప్ర‌స్తుతం ర‌వితేజ సైంటిఫిక్ ఫిక్ష‌న్ మూవీ ‘డిస్కో రాజా’తో బిజీగా ఉన్నాడు. అది పూర్త‌య్యేలోగా.. గోపీచంద్‌ చిత్రం ప‌ట్టాలెక్కుతుంద‌ని తెలుస్తోంది. మ‌రి.. ఇప్ప‌టికే ర‌వితేజ‌కి రెండు సార్లు క‌లిసొచ్చిన గోపీచంద్‌.. తాజా చిత్రంతో హ్యాట్రిక్ న‌మోదు చేసుకుంటాడేమో చూడాలి.

ర‌వితేజ‌తో హ్యాట్రిక్ కొడతాడా? | actioncutok.com

Trending now: