‘దేశముదురు’ అమ్మాయి.. 50 సినిమాలు!


2003లో బాలనటిగా పరిచయమైన హన్సిక ఈ ఏడాది విడుదలవనున్న ‘మహా’ సినిమాతో 50 సినిమాలు పూర్తి చేసుకుంటోంది.

'దేశముదురు' అమ్మాయి.. 50 సినిమాలు!

‘దేశముదురు’ అమ్మాయి.. 50 సినిమాలు!

అందాల తార హన్సిక అప్పుడే 50 సినిమాలను పూర్తి చేసుకోబోతున్నది. 2003లో బాలనటిగా ‘హవా’లో నటించడం ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టిన హన్సికా మొత్వాని 2007లో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘దేశముదురు’లో అల్లు అర్జున్ సరసన నాయికగా నటించడం ద్వారా హీరోయిన్‌గా మారింది.

ఈ నెల 9న విడుదలవుతున్న తమిళ చిత్రం ‘100’ ఆమెకు 49వ సినిమా. ఈ యాక్షన్ ఫిలింలో ఆమె అధర్వ జోడీగా కనిపించనున్నది. ప్రస్తుతం ఆమె ‘మహా’, ‘పార్ట్‌నర్’ అనే రెండు తమిళ చిత్రాల్లోనూ, తెలుగు సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఏ బీఎల్’లోనూ నటిస్తోంది.

వీటిలో ‘మహా’ హన్సిక 50వ సినిమాగా విడుదలవనున్నది. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ సంచలనం సృష్టించడమే కాకుండా పెద్ద దుమారాన్నీ లేవదీసింది. ఆ పోస్టర్‌లో మహరాజా కుర్చీలో కాషాయ వస్త్రాలు ధరించి కూర్చున్న హన్సిక గంజాయి దమ్ము బిగించి కొడుతూ కనిపించింది.

యు.ఆర్. జమీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శ్రీకాంత్ (మనకు శ్రీరాం) హీరోగా నటిస్తున్నాడు. హన్సిక రకరకాల్ గెటప్పులలో కనిపించే ఈ సినిమాలో హన్సిక మాజీ ప్రియుడు శింబు ఒక స్పెష్ల్ రోల్ చేస్తుండటం గమనార్హం.

‘దేశముదురు’ అమ్మాయి.. 50 సినిమాలు! | actioncutok.com

Trending now: