జగన్‌లో లయన్ కింగ్‌ని చూస్తున్నా!


జగన్‌లో లయన్ కింగ్‌ని చూస్తున్నా!
Puri Jagannath

జగన్‌లో లయన్ కింగ్‌ని చూస్తున్నా!

ఒకరు వై.ఎస్. జగన్… ఇంకొకరు పూరి జగన్. ఒకరు రాజకీయవేత్త. ఇంకొకరు సినీ దర్శకుడు. రాజకీయవేత్త నుంచి ముఖ్యమంత్రి కాబోతున్న జగన్‌ను సినీ జగన్ పొగడ్తలతో ముంచెత్తారు. వైఎస్ జగన్ తనకొక లయన్ కింగ్‌లా కనిపిస్తున్నారంటూ ఆకాశానికెత్తేశారు. ఎందుకని?

పూరి జగన్నాథ్ తమ్ముడు ఉమాశంకర్ గణేశ్ ఐదేళ్ల క్రితం నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు మరోసారి అవకాశమిచ్చారు వైఎస్ జగన్. నర్సీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన ఉమాశంకర్ గణేశ్ ఈసారి విజయం సాధించారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు పూరి జాగన్నాథ్. వైఎస్ జగన్‌ను వారియర్‌గా కొనియాడారు. ఎన్నికల రోజు తాను వైజాగ్‌లో ఉండి కుటుంబ సభ్యులతో టీవీ చూస్తూ కూర్చున్నాననీ, వార్ వన్ సైడ్ అయ్యేసరికి తనకు మతిపోయిందనీ ఆయన అన్నారు. జగన్ గురించి సుదీర్ఘంగా తన భావాలు పంచుకున్న ఆయన జగన్‌తో తన తమ్ముడు కలిసిన ఫొటోను కూడా షేర్ చేశాడు. పూరి జగన్ భావోద్వేగం ఎలా ఉందో చూడండి…

జగన్‌లో లయన్ కింగ్‌ని చూస్తున్నా!
జగన్‌లో లయన్ కింగ్‌ని చూస్తున్నా!
Uma Shankar Ganesh with YS Jagan

జగన్‌లో లయన్ కింగ్‌ని చూస్తున్నా! | actioncutok.com

More for you: