ఆంధ్రలో మన విజయాన్ని ఎవరూ ఆపలేరు!


ఆంధ్రలో మన విజయాన్ని ఎవరూ ఆపలేరు!
Chandrababu

ఆంధ్రలో మన విజయాన్ని ఎవరూ ఆపలేరు!

అమరావతి : ఆంధ్ర రాష్ట్రంలో మన విజయాన్ని  ఎవరూ ఆపలేరని, నూటికి నూరు శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్య మంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 18 నుంచి 20 ఎంపీ స్థానాలు గెలుస్తున్నామని స్పష్టం చేశారు. సోమవారం చంద్రబాబు పార్టీ నాయకులతో  నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ మన గెలుపు 110 స్థానాలతో ప్రారంభమవుతుందని, అది 120 నుంచి 130 స్థానాల వరకు వెళ్లొచ్చని అన్నారు.

ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేసిందని, మంగళవారం  అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. వీవీ పాట్లు లెక్కించాలనే డిమాండ్‌తో ఆందోళన చేపెడతామన్నారు. ఎన్నికల కమిషన్ తన అధికారాలను  దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. అందరూ  అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కౌంటింగ్ ప్రక్రియపై 22న  అందరికీ మరోమారు శిక్షణ ఇస్తామన్నారు. వీవీ పాట్ల లెక్కింపులోను జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రతిపక్షాలవారు మైండ్ గేమ్‌తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

ఆంధ్రలో మన విజయాన్ని ఎవరూ ఆపలేరు! | actioncutok.com