ఐపీఎల్ 2019: ఆ ఇద్దరూ సేమ్ టు సేమ్!


ఐపీఎల్ 2019 లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు, సన్‌రైజర్స్ ప్లేయర్ విజయ్ శంకర్ ఒకే రకంగా 19.9 యావరేజ్‌తో ఒక్కొక్కరు 219 పరుగులు చేశారు.

ఐపీఎల్ 2019: ఆ ఇద్దరూ సేమ్ టు సేమ్!
Vijay Shankar and Ambati Rayudu

ఐపీఎల్ 2019: ఆ ఇద్దరూ సేమ్ టు సేమ్!

ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఒక రకంగా చెప్పాలంటే వింత! ఐపీఎల్ లీగ్ దశలో ఇద్దరు ఆటగాళ్లు బ్యాటింగ్‌లో ఒకే విధమైన ప్రదర్శన కనపర్చారు. ఒకే రకమైన యావరేజ్‌తో ఎక్కువ తక్కువ కాకుండా ఒకే రకంగా పరుగులు చేశారు! ఆ ఇద్దరిలో ఒకరు.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడైన అంబటి రాయుడు, ఇంకొకరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు విజయ్ శంకర్.

అవును. లీగ్‌లో ఇద్దరు ఆటగాళ్లూ అన్ని మ్యాచ్‌లు.. అంటే 14 మ్యాచ్‌లూ ఆడారు. ఇద్దరూ సమానంగా 219 పరుగులు చేశారు. ఇద్దరి బ్యాటింగ్ యావరేజ్ 19.9. ఈ లెక్కలు చూసి ఇదెలా సాధ్యమయ్యిందా అని అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. కొన్ని వింతలు అలా జరుగుతుంటాయి మరి. కాకపోతే ఒక్కటే తేడా. అంబటి రాయుడు బ్యాట్స్‌మన్ మాత్రమే. అందుకు భిన్నంగా విజయ్ ఆల్‌రౌండర్. కొన్ని మ్యాచ్‌లలో బౌలింగ్ కూడా చేశాడు.

అయితే ఇద్దరూ తమ సామర్థ్యానికి తగ్గట్లు ఆడకపోవడం గమనార్హం. గత ఐపీఎల్‌లో అంబటి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడు కాగా ఈసారి లీగ్‌లో అతడి బ్యాట్ నుంచి పరుగుల ప్రవాహం కనిపించలేదు. ఇక ప్రతిభావంతుడైన ఆటగాడిగా గుర్తింపుపొందిన విజయ్ సైతం పేలవ ఫాంతో తంటాలు పడుతున్నాడు.

ఐపీఎల్ 2019: ఆ ఇద్దరూ సేమ్ టు సేమ్! | actioncutok.com

Trending now: