ఐపీఎల్ 2019: ఫైనల్‌కు దూసుకెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్!
విశాఖపట్నంలో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఐపీఎల్ 2019: ఫైనల్‌కు దూసుకెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్!
అనూహ్యమేమీ జరగలేదు. అద్భుతాలేమీ ఆవిష్కృతం కాలేదు. అనుభవం చేతిలో యువరక్తం ఓటమి పాలయింది. వరుసగా రెండో సారి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2019 ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ జట్టుపై ధోనీ సేన ఇంకా ఆరు బంతులు మిగిలుండగానే ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్న ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో తలపడనున్నది.
148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఓపెనర్లు ఫాఫ్ డూప్లెసిస్, షేన్ వాట్సన్ గొప్ప ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఈ సీజన్లో చెన్నైకి తొలి వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం గమనార్హం. ఓపెనర్లిద్దరూ సరిగ్గా హాఫ్ సెంచరీలు చేసి అవుటవడం విశేషం. మిగతా పనిని అంబటి రాయుడు (20 నాటౌట్) పూర్తి చేశాడు.
కీమో పాల్ బౌలింగ్‌ను చెన్నై బ్యాట్స్‌మెన్ ఊచకోత కోశారు. వాళ్ల ధాటికి పాల్ 3 ఓవర్లలోనే 49 పరుగులు సమర్పించుకున్నాడు. చక్కగా బౌలింగ్ చేసిన ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 20 పరుగులు, అమిత్ మిశ్రా 21 పరుగులు మాత్రమే ఇచ్చారు. డూప్లెసిస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఐపీఎల్ ఫైనల్ చేరడం సీఎస్కేకు ఇది ఎనిమిదవసారి.
ఐపీఎల్ 2019: ఫైనల్‌కు దూసుకెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్! | actioncutok.com
Trending now: