ఐపీఎల్ 2019: చెన్నై లక్ష్యం 148
విశాఖపట్నంలో జరుగుతున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ 147 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019: చెన్నై లక్ష్యం 148
ఐపీఎల్ ఫైనల్‌కు చేరే రెండో జట్టును నిర్ణయించే రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఢిల్లీ కేపిటల్స్ 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లోటాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 147 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (38) టాప్ స్కోరర్.
చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టగా, ఇమ్రాన్ తాహిర్ కీలకమైన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వికెట్ పడగొట్టాడు. ఢిల్లీ జట్టు చివరి ఐదు ఓవర్లలో 4 వికెట్లు పోగొట్టుకొని 54 పరుగులు చేసింది.
పవర్‌ప్లేలో రెండు వికెట్లకు 41 పరుగులు చేసిన ఢిల్లీ జట్టు 46 బంతుల్లో 50 పరుగులు చేసింది. తర్వాత మరో 47 బతులు ఆడి 100 పరుగులు పూర్తి చేసింది. డ్వేన్ బ్రావో 2 వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేసి, 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చాడు.
ఢిల్లీ జట్టులో పంత్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌లో ఏ ఒక్కరూ 30 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. పంత్ తర్వాత కొలిన్ మన్రో చేసిన 27 పరుగులే అత్యధికం. ఐదుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఐపీఎల్ 2019: చెన్నై లక్ష్యం 148 | actioncutok.com
Trending now: