ఐపీఎల్ 2019: రెండు నిమిషాల్లో అమ్ముడైపోయిన ఫైనల్ టికెట్లు!


మే 12న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆన్‌లైన్ టికెట్లు 2 నిమిషాల్లోనే అమ్ముడవడం అనేక సందేహాలకు తావిస్తోంది.

ఐపీఎల్ 2019: రెండు నిమిషాల్లో అమ్ముడైపోయిన ఫైనల్ టికెట్లు!

ఐపీఎల్ 2019: రెండు నిమిషాల్లో అమ్ముడైపోయిన ఫైనల్ టికెట్లు!

రెండే రెండు నిమిషాలు.. ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్ ఆన్‌లైన్ టికెట్లు అమ్ముడవడానికి పట్టిన సమయం. ఇది ఓవైపు మన దేశంలోని క్రికెట్ పిచ్చికి ఒక నిదర్శనంగా కనిపిస్తున్నా.. అనేక ప్రశ్నల్నీ లేవనెత్తుతోంది. ఈ టికెట్ల అమ్మకం పారదర్శకంగా, జవాబుదారీతనంగా జరిగిందా?.. అనే సందేహం కలుగుతోంది.

ముందుగా ఎలాంటి ఎలాంటి ప్రకటనా లేకుండానే మంగళవారం ఫైనల్ టికెట్లను బీసీసీఐ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. ఇది అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత జరిగిందే అసలు కథ. ఆరోజు ఉదయం టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నట్లు బీసీసీఐ చెప్పింది. ఇంకేముంది.. క్రికెట్ ప్రేమికులు టికెట్ల కొనేందుకు ప్రయత్నించారు. వాళ్లను షాక్‌కు గురిచేస్తూ టికెట్లనీ అమ్ముడైపోయినట్లు జవాబొచ్చింది.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వచ్చే ఆదివారం (మే 12) హైదరాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39 వేలు. సాధారణంగా 25 వేల నుంచి 30 వేల టికెట్లు అమ్మకానికి పెడుతుంటారు. ఒక సమాచారం ప్రకారం రూ. 1000, రూ. 1500, రూ. 2000, రూ. 2500, రూ. 5000, రూ. 10000, రూ. 12000, రూ. 15000, రూ. 22500 రేట్ల టికెట్లు అమ్మాలి. కానీ ఈవెంట్స్ నౌ సంస్థ కేవలం రూ. 1500, రూ. 2000, రూ. 2500, రూ. 5000 ధరల టికెట్లను మాత్రమే అమ్మింది.

మిగతా ధరల టికెట్లు ఏమయ్యాయి? అవెక్కడికి వెళ్లాయి? అసలు అమ్మకానికి పెట్టినవి కూడా కేవలం రెండు నిమిషాల్లోనే ఎలా అమ్ముడయ్యాయి?.. అనే ప్రశ్నలకు జవాబు చెప్పేవాళ్లు లేరు.

ఐపీఎల్ 2019: రెండు నిమిషాల్లో అమ్ముడైపోయిన ఫైనల్ టికెట్లు! | actioncutok.com

Trending now: