ఐపీఎల్ 2019 ఫైనల్: రోహిత్ సేనను ధోనీ బృందం ఆపగలదా?


ఐపీఎల్ 2019 ఫైనల్: రోహిత్ సేనను ధోనీ బృందం ఆపగలదా?

ఐపీఎల్ 2019 ఫైనల్: రోహిత్ సేనను ధోనీ బృందం ఆపగలదా?

గత ఏడాది ఐపీఎల్ కప్‌ను గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. మూడు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. అప్పట్నుంచీ రెండింటిలో ఏది ఉత్తమ జట్టనే డిబేట్ జరుగుతూ వస్తోంది.

ఈ సారి రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై జట్టు లీగ్‌లో టాప్‌లో నిలవడమే కాకుండా ముందుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. వాళ్లది సమష్ఠి కృషి. ఆ జట్టులోని నలుగురు బ్యాట్స్‌మెన్ 300కు పైగా పరుగులు చేశారు. ఐదుగురు బౌలర్లు 10 అంతకంటే ఎక్కువ వికెట్లు తీశారు.

ఆ జట్టులో డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు చేయడంలో హార్దిక్ పాండ్యా అందరికంటే ముందున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు అతడు చేసిన 385 పరుగులు ఆ జట్టు అగ్ర స్థానంలో నిలవడానికి దోహదం చేశాయి. అతడి వల్ల ముంబై జట్టు ప్రత్యర్థులకు ఇచ్చే టార్గెట్లు అలవి కానివి కావడంలో లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా వేసే 8 ఓవర్లు కీలకమవుతున్నాయి.

మరోవైపు.. క్రికెట్‌లో వయసు ముదిరినవాళ్లు రాణించడం కష్టమనే సాధారణాభిప్రాయాన్ని తప్పని నిరూపించిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఆగటాళ్ల సగటు వయసు 35 పెట్టుకొని ఏ జట్టు వరుసగా రెండేళ్లు ఫైనల్ చేరుతుంది.. ఒక చెన్నై జట్టు తప్ప! అది ఎం.ఎస్. ధోని నాయకత్వ సామర్థ్యం, అతని సొంత ఫాం వల్లే సాధ్యమైంది. ఆడిన 10 సీజన్లలో ఎనిమిదోసారి చెన్నై జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అసాధారణ రికార్డ్!

414 పరుగులతో ధోనీకి ఇది బెస్ట్ ఐపీఎల్ సీజన్‌గా మారింది. అనేక సందర్భాల్లో చెన్నై బ్యాటింగ్ భారాన్ని అతడే మోశాడు. డూప్లెసిస్, షేన్ వాట్సన్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్ వంటి సపోర్టింగ్ ప్లేయర్ల అండతో అతని జట్టు ఫైనల్‌కు చేరుకుంది.

ఫైనల్ మ్యాచ్ అనేది డిఫరెంట్ బాల్ గేం. ఈ సీజన్లో తలపడిన మూడు సార్లూ చెన్నైపై ముంబై ఆధిపత్యం ప్రదర్శించింది. కాగా 2017లో ఇదే హైదరాబాద్ వేదికగా తన చివరి ఐపీఎల్ కప్‌ను ముంబై గెలిచింది. పైగా ఫైనల్‌కు వచ్చిన ఏ ఒక్కసారీ  ముంబై ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ సేనను ధోనీ బృందం ఎలా నిలువరిస్తుందన్నది ఆసక్తికరం.

ఐపీఎల్ 2019 ఫైనల్: రోహిత్ సేనను ధోనీ బృందం ఆపగలదా? | actioncutok.com

Trending now: