ఐపీఎల్ 2019: అంతా స్పిన్నర్లే చేశారు!


ఒక పేస్ బౌలర్‌ను తప్పించి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను స్పిన్‌తోనే కట్టడి చేసింది.

ఐపీఎల్ 2019: అంతా స్పిన్నర్లే చేశారు!

ఐపీఎల్ 2019: అంతా స్పిన్నర్లే చేశారు!

ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లోని తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ నైపుణ్యంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. లోకల్ స్టార్లతోటే ముంబై ఈ గెలుపు సాధించడం గమనించదగ్గ అంశం. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ జట్టును గెలుపు తీరాలకు చేర్చగా, బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు ముగ్గురు స్పిన్నర్లు.. రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, క్రునాల్ పాండ్యా చెన్నై జట్టును వణికించారు. వీళ్లంతా దేశీయులే కావడం విశేషం.

గత మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడి గెలిచినా, చెపాక్ మైదానాన్ని దృష్టిలో ఉంచుకొని ముంబై కెప్టెన్ రోహిత్ పేసర్ మెక్‌క్లెనెగన్‌ను తప్పించి, మూడో స్పిన్నర్‌గా జయంత్ యాదవ్‌ను తీసుకోవడం గొప్ప ఫలితాన్నిచ్చింది. ముంబై స్పిన్నర్ల ధాటికి బ్యాటింగ్ చెయ్యడంలో చెన్నై నానా తిప్పలూ పడింది. రోహిత్ ఎలాంటి సాహసం చేశాడంటే ప్రధాన పేసర్లలో ఒకడైన లసిత్ మలింగ చేత మూడు ఓవర్లే వేయించాడు. మలింగ బౌలింగ్‌ను ధోని ఆటాడుకుంటాడని తెలిసే అతడీ పని చేశాడు. 15, 16 ఓవర్లను స్పిన్నర్ల చేత వేయించడం కెప్టెన్ తెలివికి నిదర్శనం.

కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా ఫాంలో ఉన్న సురేశ్ రైనాను నాలుగో ఓవర్‌లోనే జయంత్ కాట్ అండ్ బౌల్డ్ చెయ్యడం చెన్నై బ్యాటింగ్ లయ తప్పేలా చేసింది. ఇక రాహుల్ చాయర్ అయితే మరింత అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కీలక మ్యాచ్‌లో ఎలాంటి తడబాటు లేకుండా బౌలింగ్ చేసి, 4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి, డూప్లెసిస్, మురళీ విజయ్ వికెట్లు పడగొట్తాడు. పవర్‌ప్లే ముగిసే సమయంలో షేన్ వాట్సన్‌ను క్రునాల్ పాండ్యా ఔట్ చేశాడు. అతడు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి, 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చాడు.

ఇలా స్పిన్నర్లు కట్టడి చెయ్యడంతో చెన్నై సౌకర్యవంతంగా బ్యాటింగ్ చెయ్యలేకపోయింది. బోర్డుపై 150 కాదు కదా, కనీసం 140 పరుగులు ఉండేలా కూడా చెయ్యలేకపోయింది. అలా ముంబై గెలుపులో స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించారు.

ఐపీఎల్ 2019: అంతా స్పిన్నర్లే చేశారు! | actioncutok.com

Trending now: