ఐపీఎల్ 2019: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్!


ఐపీఎల్ 2019: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్!

ఐపీఎల్ 2019: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హిస్టరీలో లీద్ దశలో 12 పాయింట్లతోటే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఈ టోర్నమెంట్ నాకౌట్ దశలోకి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లతో చేరింది హైదరాబాద్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్‌తో శనివారం (మే 4) జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఓటమి పాలవడంతో హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలు సందిగ్ధంలో పడ్డాయి. అయితే ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన చిట్టచివరి లీగ్‌లో ముంబై చేతిలో కోల్‌కతా నైట్ రైడర్స్ 9 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడటంతో హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కి వెళ్లగలిగింది.

ఇటు హైదరాబాద్ (+0.58), అటు కోల్‌కతా (+0.03) లీగ్ దశను 12 పాయింట్లతోటే ముగించినప్పటికీ, మంచి నెట్ రన్ రేట్ (ఎన్ఆర్ఆర్) కారణంగా విలియమ్సన్ సేన తదుపరి రౌండ్‌కు చేరింది.

లీగ్‌లో 18 పాయింట్లు, మంచి ఎన్ఆర్ఆర్‌తో ముంబై ఇండియన్స్ (+0.42) అగ్ర స్థానంలో నిలవగా, అన్నే పాయింట్లు ఉన్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ +0.13 ఎన్ఆర్ఆర్‌తో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. టేబుల్‌పై టాప్‌లో నిలవాలంటే మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై నెగ్గాల్సి ఉండగా, 6 వికెట్ల తేడాతో చెన్నై ఓడిపోయింది. ఢిల్లీ (+0.04) కూడా 18 పాయింట్లు సాధించినప్పటికీ, దాని ఎన్ఆర్ఆర్ చెన్నై కంటే తక్కువగా ఉండటంతో మూడో స్థానానికి పడిపోయింది.

ఐపీఎల్ 2019: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్! | actioncutok.com

Trending now: