ఐపీఎల్ 2019: వాట్సన్ వైఫల్యం.. చెన్నై కలవరం!


ఐపీఎల్ 2019: వాట్సన్ వైఫల్యం.. చెన్నై కలవరం!
Shane Watson

ఐపీఎల్ 2019: వాట్సన్ వైఫల్యం.. చెన్నై కలవరం!

తాజా ఐపీఎల్ సీజన్‌లో అన్ని జట్ల కంటే ముందు ప్లేఆఫ్స్‌కు వెళ్లిన జట్టు మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. లీగ్ ముగిసేసరికి ఆ జట్టు రెండో స్థానంలో నిలిచింది. మంగళవారం (మే 7) క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో టాప్ టీం ముంబై ఇండియన్స్‌తో సీఎస్‌కే తలపడుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోనే జరుగుతుండటం ఆ జట్టుకు లాభించే అంశం.

కాగా ప్లేఆఫ్స్‌కు సంబంధించి చెన్నై జట్టును కలవరపరుస్తోన్న అంశం ఓపెనర్ షేన్ వాట్సన్ ఆటతీరు. 2018 ఐపీల్ ట్రోఫీని చెన్నై జట్టు గెలవడంలో ప్రధాన పాత్ర పోషించిన్ వాట్సన్ ఈ సీజన్‌లో పేలవ ఆటతీరుతో సీఎస్‌కే అభిమానుల్ని నిరాశపరుస్తున్నాడు. ఒక్క హైదరాబాద్ జట్టుతో ఆడిన మ్యాచ్‌లో మాత్రమే 93 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు వాట్సన్.

ఆ ఇన్నింగ్స్ తప్పితే మిగతా మ్యాచ్‌లలో అతడి బ్యాట్ నుంచి మెరుపులే లేవు. పైగా లీగ్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో అతడు 10 సార్లు పవర్‌ప్లే దశలోనే అవుటవడం ధోనీ బృందాన్ని కలవరపరుస్తోంది. క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. లేదంటే ఢిల్లీ, హైదరాబాద్ జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడాల్సి వస్తుంది. అక్కడా ఓడితే ఖేల్ ఖతం.

అందుకే వాట్సన్ ఫాంపై చెన్నై జట్టు కలవరానికి గురవుతోంది. పవర్‌ప్లేలో అతడు విజృంభించి ఆడితే మిగతా పని పూర్తి చెయ్యడానికి డూప్లెసిస్, రైనా, ధోనీ వంటి ఆటగాళ్లున్నారు. వాట్సన్ వైఫల్యం డూప్లెసిస్, రైనాపై ఒత్తిడి కలిగిస్తోంది. సురేశ్ రైనా సూపర్ ఫాంలో ఉండటం చెన్నైని ఆనందపరుస్తోంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడినప్పటికీ డూప్లెసిస్ సూపర్‌గా ఆడటం చెన్నై జట్టుకి ఊరటనిచ్చింది.

క్వాలిఫయర్ 1లో ముంబై జట్టుని ఓడించి నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లాలని ధోనీ కృత నిశ్చయంతో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగా వాట్సన్ మెరుపులు మెరిపిస్తాడా? చూడాలి.

ఐపీఎల్ 2019: వాట్సన్ వైఫల్యం.. చెన్నై కలవరం! | actioncutok.com

Trending now: