ఐపీఎల్: చెపాక్ ధోనీది కాదు.. రోహిత్‌ది!


చెపాక్ స్టేడియంలో ధోనీ సేనతో తలపడిన ప్రతిసారీ విజయం సాధించి 100 శాతం గెలుపు రికార్డు సాధించాడు రోహిత్ శర్మ.

ఐపీఎల్: చెపాక్ ధోనీది కాదు.. రోహిత్‌ది!
Rohit Sharma

ఐపీఎల్: చెపాక్ ధోనీది కాదు.. రోహిత్‌ది!

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభంలోనే ఔటయి అభిమానుల్ని నిరాశపరచి ఉండవచ్చు గాక, కానీ తన జట్టును మాత్రం గెలిపించాడు. రోహిట్ ఔటయ్యాక బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ 54 బంతుల్లో 71 పరుగులు చేసి, ఈ సీజన్‌లో చెన్నై జట్టును ముంబై ముచ్చటగా మూడోసారి ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ సేనపై రోహిత్ వరుసగా 7వ మ్యాచ్ గెలిచి, ఆ జట్టుపై 100 శాతం గెలుపు రికార్డును సాధించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు అంబటి రాయుడు, ధోనీ ఆ మాత్రం ఆడబట్టి 131 పరుగులైనా చేయగలిగింది. అటు పరుగులు సాధించడంలో, జట్టుకు ఊపునివ్వడంలో మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్ షేన్.. వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, సురేశ్ రైనా ఫెయిలయ్యారు. బరువునంతా మిడిలార్డర్‌పై మోపారు. రాయుడు 42, ధోని 37 పరుగులు చేసి, జట్టుకు ఓ మాదిరి స్కోరు అందించగలిగారు.

చెపాక్‌లోని ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో ఆడిన ఏ మ్యాచ్‌లోనూ, ఏ జట్టు తరపున ఆడినా రోహిత్ ఓటమి అనేది చూడలేదు. ప్రస్తుతం ఉనికిలో లేని దక్కన్ చార్జర్స్ తరపున ఆడినప్పుడు కూడా 2008, 2010 సీజన్‌లలో గెలుపు సాధించాడు. మిగతా ఐదు సందర్భాల్లో ముంబై తరపున ఆడి విజయ బావుటా ఎగరేశాడు.

చెపాక్‌లో రోహిత్ రికార్డ్

2008: 7 వికెట్ల తేడాతో గెలుపు

2010: 31 పరుగుల తేడాతో గెలుపు

2012: 8 వికెట్ల తేడాతో విజయం

2013: 9 పరుగుల తేడాతో గెలుపు

2015: 6 వికెట్ల తేడాతో విజయం

2019: 46 పరుగుల తేడాతో విజయం

2019: 6 వికెట్ల తేడాతో గెలుపు

ఐపీఎల్: చెపాక్ ధోనీది కాదు.. రోహిత్‌ది! | actioncutok.com

More for you: