సమర రంగంలో తార‌క్‌, చ‌ర‌ణ్‌!


సమర రంగంలో తార‌క్‌, చ‌ర‌ణ్‌!

సమర రంగంలో తార‌క్‌, చ‌ర‌ణ్‌!

‘ఆర్ ఆర్ ఆర్‌’.. ఈ జ‌న‌రేష‌న్ సెన్సేష‌న‌ల్ మ‌ల్టిస్టార‌ర్‌. య‌న్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ వంటి ఒకే త‌రం అగ్ర క‌థానాయ‌కుల‌తో.. ప‌రాజ‌య‌మంటూ ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం కావ‌డంతో.. ఈ సినిమాపై ఎనౌన్స్‌మెంట్  డే నుంచే స్కై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏర్ప‌డ్డాయి. దానికి తోడు.. ఇదో పిరియాడిక్ డ్రామా అని.. ఇందులో కొమ‌రం భీమ్‌గా తార‌క్‌, అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ క‌నిపిస్తార‌ని జ‌క్క‌న్న‌ క్లారిటీ ఇచ్చాక ఆ అంచ‌నాల‌కు ఆస‌క్తి తోడ‌య్యింది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే కొంత‌మేర షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం.. ఇటీవ‌ల వేర్వేరు సంద‌ర్భాల్లో తార‌క్‌, చ‌ర‌ణ్ గాయ‌ప‌డ‌డంతో కొన్నాళ్ళు  రెస్ట్ మోడ్‌లో ఉండిపోయింది. అయితే.. ఇద్ద‌రూ గాయాల నుండి కోలుకోవ‌డంతో.. తాజాగా మ‌ళ్ళీ సెట్స్ పైకి వెళ్ళింది ‘ఆర్ ఆర్ ఆర్‌’.  ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో వేసిన స్పెష‌ల్ సెట్‌లో ఈ సినిమా షూట్ జ‌రుగుతోంది.

దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తార‌ని.. క‌థానాయిక అలియా భ‌ట్ కూడా షూట్‌లో జాయిన్ అవుతుంద‌ని ఇన్‌సైడ‌ర్స్ టాక్‌.  కాగా.. ప్ర‌స్తుతం బ్రిటీష‌ర్ల‌పై కొమ‌రం భీమ్‌, అల్లూరి సీతారామ‌రాజు పోరాడుతున్న ఘ‌ట్టాల‌ను తెర‌కెక్కిస్తున్నార‌ని తెలిసింది. అలాగే.. ఈ ఘ‌ట్టాలు సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ట‌. నిర‌వ‌ధికంగా జ‌రిగే షెడ్యూల్‌లో వీటితో పాటు మ‌రికొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ప్లాన్ చేస్తున్నాడ‌ట జ‌క్క‌న్న‌.

సమర రంగంలో తార‌క్‌, చ‌ర‌ణ్‌! | actioncutok.com

More for you: