‘ఆర్ ఆర్ ఆర్‌’.. ఏమౌతుందో?


'ఆర్ ఆర్ ఆర్‌'.. ఏమౌతుందో?

‘ఆర్ ఆర్ ఆర్‌’.. ఏమౌతుందో?

తెలుగునాట అప‌జ‌య‌మంటూ ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు ఎస్.ఎస్‌.రాజ‌మౌళి. ఇక తొలి చిత్రం ‘స్టూడెంట్ నంబ‌ర్ 1’ నుంచి గ‌త చిత్రం ‘బాహుబ‌లి – ది కంక్లూజ‌న్‌’ వ‌ర‌కు ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి ఎదిగిన తీరు ప్ర‌శంస‌నీయం. ప్ర‌స్తుతం ఈ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ massive మ‌ల్టీస్టార‌ర్ ‘ఆర్ ఆర్ ఆర్‌’తో బిజీగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.  ఇప్ప‌టికే ఈ చిత్రాన్ని 2020 జూలై 30న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించేశాడు జ‌క్క‌న్న‌.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమిటంటే.. ఇదే జూలై నెల‌లో ఇప్ప‌టివ‌ర‌కు రాజ‌మౌళి రూపొందించిన ఐదు చిత్రాలు రిలీజయ్యాయి. జ‌క్క‌న్న 12వ సినిమాగా తెర‌కెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్‌’ ఈ జాబితాలో ఆరో చిత్రం కానుంది. అంతేకాదు.. ఇదివ‌ర‌కు జూలైలో విడుద‌లైన రాజ‌మౌళి చిత్రాల‌న్నీ కూడా ఆయా హీరోల‌కు ఆయా స‌మ‌యాల్లో career best hits గా నిలిచాయి.

‘సింహాద్రి’ (2003 జూలై 9) తార‌క్ ఆ స‌మ‌యానికి career best కాగా.. ‘మ‌గ‌ధీర‌’ (2009 జూలై 31) చ‌ర‌ణ్‌కి అప్ప‌ట్లో బిగ్గెస్ట్ hit గా నిల‌చింది. అలాగే ‘మ‌ర్యాద‌రామ‌న్న’ (2010 జూలై 23), ‘ఈగ‌’ (2012 జూలై 6).. అప్ప‌ట్లో సునీల్‌, నాని career బెస్ట్స్‌గా నిల‌చాయి. ఇక 2015 జూలై 10న రిలీజైన ‘బాహుబ‌లి – ది బిగినింగ్‌’.. ప్ర‌భాస్‌కి అప్ప‌ట్లో career best.

ఈ లెక్క‌న చూసుకుంటే.. 2020లో రాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్‌’ కూడా తార‌క్‌, చ‌ర‌ణ్ career లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే.. రాజ‌మౌళి జూలై సెంటిమెంట్‌తో తార‌క్‌, చ‌ర‌ణ్ విడివిడిగా career బెస్ట్స్‌ అందుకున్నారు. ఇప్పుడు క‌ల‌సి ఆ ఫీట్‌నిrepeat చేస్తారేమో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

‘ఆర్ ఆర్ ఆర్‌’.. ఏమౌతుందో? | actioncutok.com

More for you: