స్టాలిన్‌తో కేసీఆర్‌ ఏం మాట్లాడారు?


స్టాలిన్‌తో కేసీఆర్‌ ఏం మాట్లాడారు?
KCR and Stallin

స్టాలిన్‌తో కేసీఆర్‌ ఏం మాట్లాడారు?

చెన్నై: డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తో సోమవారం  తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు సాగిన ఈ భేటీలో కేసీఆర్‌ వెంట తెరాస ఎంపీలు వినోద్‌, సంతోష్‌కుమార్‌లు పాల్గొన్నారు. అలాగే స్టాలిన్ తో పాటు  డీఎంకే నేతలు దురైమురుగన్‌, టీఆర్‌ బాలు పాల్గొన్నారు.

చెన్నై ఆళ్వారుపేటలోని స్టాలిన్‌ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలను బలమైన శక్తులుగా చేయడానికి అనుసరించాల్సిన  వ్యూహం పైనా చర్చించినట్టు తెలిసింది.

త్వరలో వెలువడనున్న  ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్‌  పార్టీలు స్పష్టమైన మెజార్టీ సాధించలేవని, పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలే బలమైన కూటమిగా ఏర్పడటం వల్ల కలిగే ఫలితాలపై కేసీఆర్‌ స్టాలిన్‌కు వివరించినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం ఇద్దరు నేతలూ మీడియాతో ఏమీ మాట్లాడలేదు. సమావేశం ముగిసిన వెంటనే కేసీఆర్‌ చెన్నై నుంచి బయలుదేరి హైదరాబాద్‌ వచ్చేశారు.

స్టాలిన్‌తో కేసీఆర్‌ ఏం మాట్లాడారు? | actioncutok.com

Trending now: