తిరుమలలో కేసీఆర్ దంపతులు


తిరుమలలో కేసీఆర్ దంపతులు

తిరుమలలో కేసీఆర్ దంపతులు

తిరుపతి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా  చేరుకున్నారు.  అక్కడ వారికి  టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఈ రాత్రికి కేసీఆర్ కుటుంబం టీటీడీ అతిథి గృహంలో బస చేయనుంది. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని అనంతరం హైదరాబాద్ బయలుదేరతారు.

అంతకుముందు హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి  చేరుకున్న  కేసీఆర్ దంపతులకు వైకాపా సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లారు. కేసీఆర్ రాక సందర్బంగా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తిరుమలలో కేసీఆర్ దంపతులు | actioncutok.com

More for you: