నిన్న ‘మహానటి’.. రేపు మ‌రో ‘స‌ఖి’!


నిన్న 'మహానటి'.. రేపు మ‌రో 'స‌ఖి'!
Keerthy Suresh

నిన్న ‘మహానటి’.. రేపు మ‌రో ‘స‌ఖి’!

‘స‌ఖి’.. అటు ఇటుగా రెండు ద‌శాబ్దాల క్రితం  కుర్ర‌కారుని ఫిదా చేసిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం, ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం, పీసీ శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌ణం, మాధ‌వ‌న్ – షాలిని జోడీ.. వెర‌సి ఓ క్లాసిక్ ల‌వ్‌స్టోరీగా నిల‌చిందీ త‌మిళ అనువాద చిత్రం.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే టైటిల్‌తో తెలుగునాట మ‌రో సినిమా రాబోతోందని స‌మాచారం. ఈ సారి.. ‘స‌ఖి’గా అల‌రించ‌బోతున్న ఆ క‌థానాయిక మ‌రెవ‌రో కాదు.. ‘మ‌హాన‌టి’గా మురిపించిన కేర‌ళ కుట్టి కీర్తి సురేశ్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ‘మ‌హాన‌టి’ త‌రువాత స్ప‌ల్ప విరామం తీసుకుని.. ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో కీర్తి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేంద్ర తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ‘118’ ఫేమ్‌ మ‌హేశ్ కోనేరు నిర్మిస్తున్నాడు. కాగా.. ఈ సినిమాకి క‌థ రీత్యా ‘స‌ఖి’ అనే టైటిల్ అయితే బావుంటుంద‌ని యూనిట్ భావిస్తోంద‌ట‌. ఏదేమైనా.. టైటిల్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

సింహ‌భాగం విదేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌.. ఈ ఏడాది చివ‌ర‌లో రిలీజ్ కానుంది. మ‌రి.. ‘మ‌హాన‌టి’గా మెస్మ‌రైజ్ చేసిన కీర్తి.. ‘స‌ఖి’గానూ మురిపిస్తుందేమో చూడాలి.

నిన్న ‘మహానటి’.. రేపు మ‌రో ‘స‌ఖి’! | actioncutok.com

Trending now: