బన్నీతో ‘రొమాంటిక్’ హీరోయిన్!


బన్నీతో 'రొమాంటిక్' హీరోయిన్!

బన్నీతో ‘రొమాంటిక్’ హీరోయిన్!

అల్లు అర్జున్ కి కలిసొచ్చిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకున్నాయి. నాలుగేళ్ళ విరామం తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి  ‘నాన్న నేను’, ‘అలకనంద’ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 

కాగా.. ఈ సినిమాలో బన్నీకి జోడీగా ‘డీజే’ భామ పూజా హెగ్డే ఓ హీరోయిన్ గా నటిస్తోంది. రెండో కథానాయిక పాత్ర కోసం పలువురి పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆ అవకాశం కేతికా శర్మకి దక్కిందని తెలిసింది. కేతిక ప్రస్తుతం పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్’ చిత్రంలో నాయికగా నటిస్తోంది.

మరి.. రెండో తెలుగు చిత్రమే బన్నీతో అంటే.. లక్కీ ఛాన్సే అనే చెప్పాలి. ఏదేమైనా.. కేతిక ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  ఈ ఏడాది చివరలో బన్నీ-త్రివిక్రమ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

బన్నీతో ‘రొమాంటిక్’ హీరోయిన్! | actioncutok.com