ఒకే కథ: ఇక్కడ నయన్.. అక్కడ తమన్నా!

ఒకే కథ: ఇక్కడ నయన్.. అక్కడ తమన్నా!
ఒకే కాన్సెప్ట్‌తో ఒకే డైరెక్టర్ రూపొందించిన రెండు సినిమాలవి. అంతేకాదు.. రెండు భాషల్లో తెరకెక్కిన ఆ థ్రిల్లర్ మూవీస్‌లో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నటించారు. అయితే ఒక వెర్షన్ పూర్తయ్యే దశలో.. రెండో వెర్షన్‌ని మొదలుపెట్టినా.. ఇప్పుడు ఒకే రోజున ఆ చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. ఆ చిత్రాలే.. ‘కొలైయుదిర్ కాలమ్’, ‘ఖామోషి’.
ఆ వివరాల్లోకి వెళితే.. ‘ఈనాడు’ ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రధారిణిగా నటించిన తమిళ చిత్రం ‘కొలైయుదిర్ కాలమ్’. ఈ సినిమా నిర్మాణదశలో ఉన్నప్పుడే.. హిందీ వెర్షన్‌ని కూడా ప్లాన్ చేశాడు చక్రి. నయన్‌కి హిందీలో మార్కెట్ లేని కారణంగా మిల్కీ బ్యూటీ తమన్నాని ఆ వెర్షన్‌కి నాయికగా ఎంచుకున్నాడు. అయితే.. నిర్మాణం పూర్తి చేసుకున్నా ‘కొలైయుదిర్ కాలమ్’ రిలీజ్‌కి నోచుకోలేదు.
ఈ నేపథ్యంలో.. హిందీ వెర్షన్ రిలీజ్‌కి ప్లాన్ చేసాడు చక్రి. మే 31ని విడుదల తేదిగా ప్రకటించాడు. ఈ లోపు.. ‘కొలైయుదిర్ కాలమ్’కి ఉన్న అడ్డంకులు తొలగి.. జూన్ 14 రిలీజ్ డేట్‌గా ఫిక్స్ అయ్యింది. కట్ చేస్తే.. మే 31న వస్తుందనుకున్న ‘ఖామోషి’ కాస్త… సాంకేతిక కారణాల వల్ల జూన్ 14కి వాయిదా పడింది.
దీంతో.. వేర్వేరు సమయాల్లో వస్తాయనుకున్న ఈ చిత్రాలు.. ఒకే రోజున తెరపైకి రాబోతున్నట్లయ్యింది. మరి.. మూగ, చెవిటి అమ్మాయి పాత్రలో నయన్, తమన్నాల్లో ఎవరు బెస్ట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటారో తెలియాలంటే జూన్ 14 వరకు వేచి చూడాల్సిందే.
ఒకే కథ: ఇక్కడ నయన్.. అక్కడ తమన్నా! | actioncutok.com
More for you: