మహేశ్ 27: పరశురాం డైరెక్టర్.. కొరటాల శివ ప్రొడ్యూసర్!


మహేశ్ 27: పరశురాం డైరెక్టర్.. కొరటాల శివ ప్రొడ్యూసర్!
Koratala Siva

మహేశ్ 27: పరశురాం డైరెక్టర్.. కొరటాల శివ ప్రొడ్యూసర్!

యూరప్‌లో కుటుంబతో holidays ఎంజాయ్ చేస్తున్న మహేశ్ తిరిగి ఇండియాకు వచ్చేస్తున్నాడు. ఈ నెల 31న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో అతను నటించే సినిమా లాంఛనంగా మొదలవనున్నది. 2020 సంక్రాంతికి ఆ సినిమా విడుదల కానున్నది.

ఆ సినిమా తర్వాత పరశురాం డైరెక్షన్‌లో సినిమా చెయ్యడానికి మహేశ్ నిశ్చయించుకున్నాడు. ‘గీత గోవిందం’ సినిమాతో పరశురాం top league లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమాని అతను రూపొందించిన విధానం అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. ఆ మధ్య మహేశ్‌ను కలిసి కథ చెప్పాడు పరశురాం. అది నచ్చడంతో ఓకే చెప్పేశాడు మహేశ్.

వాస్తవానికి ఆ ప్రాజెక్టును చెయ్యాల్సింది అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బేనర్‌పై ఆ సినిమాని నిర్మించాలని ఆయన plan చేశాడు. మహేశ్, పరశురాం కాంబినేషన్‌ను కుదిర్చింది ఆయనే. అయితే అనూహ్యంగా అల్లు అరవింద్ స్థానంలో డైరెక్టర్ కొరటాల శివ వచ్చాడనేది ఫిలింనగర్ talk. అంటే మహేశ్ హీరోగా నటించే సినిమాని శివ produce చెయ్యబోతున్నాడన్న మాట. యువసుధా ఆర్ట్స్ అనే బేనర్‌పై ఈ సినిమా నిర్మాణమవుతుందని వినిపిస్తోంది.

అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ ముగియగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది.

మహేశ్ 27: పరశురాం డైరెక్టర్.. కొరటాల శివ ప్రొడ్యూసర్! | actioncutok.com

More for you: