ఈ సారైనా ‘ఫిదా’ చేస్తుందా?


ఈ సారైనా 'ఫిదా' చేస్తుందా?
Sai Pallavi

ఈ సారైనా ‘ఫిదా’ చేస్తుందా?

మ‌ల‌యాళ చిత్రం ‘ప్రేమ‌మ్‌’తో క‌థానాయిక‌గా తొలి అడుగులు వేసిన సాయిప‌ల్ల‌వి.. మొద‌టి సినిమాతోనే blockbuster హిట్ అందుకుంది. ఆ త‌రువాత ‘ఫిదా’తో టాలీవుడ్‌లో entry ఇచ్చిన ఈ టాలెంటెడ్ బ్యూటీకి.. తెలుగులోనూ తొలి సినిమాతో memorable hit ద‌క్కింది. అయితే.. ఇదే magic త‌మిళంలోనూ కొన‌సాగుతుంద‌నుకున్న ప‌ల్ల‌వికి.. అక్క‌డ మాత్రం చుక్కెదుర‌య్యింది.

‘దియా’ (తెలుగులో ‘క‌ణం’)తో త‌మిళ‌నాట నాయిక‌గా తొలి అడుగులు వేసిన సాయిప‌ల్ల‌వికి.. మ‌ల‌యాళ‌, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల మాదిరిగా మొదటి చిత్రంతోనే విజ‌యం ద‌క్క‌లేదు. స‌రిక‌దా.. రెండో చిత్రం ‘మారి 2’ కూడా shock ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో.. ఈ నెల 31న మూడో చిత్రం ‘ఎన్జీకే’తో ప‌ల‌క‌రించ‌నుంది ప‌ల్ల‌వి. సూర్య హీరోగా న‌టించిన ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్  మ‌రో హీరోయిన్‌గా న‌టించింది.  తొలి రెండు చిత్రాల‌తో త‌మిళ‌ తంబీల‌ను నిరాశ‌ప‌రిచిన సాయిపల్ల‌వి.. మూడో చిత్రంతోనైనా ‘ఫిదా’ చేస్తుందా?  చూడాలి మ‌రి.

ఈ సారైనా ‘ఫిదా’ చేస్తుందా? | actioncutok.com

More for you: