21 సెంటర్లలో రూ. కోటి వసూలు చేసిన ‘మహర్షి’

21 సెంటర్లలో రూ. కోటి వసూలు చేసిన ‘మహర్షి’
మహేశ్ హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 21 సెంటర్లలో రూ. కోటి గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. హైదరాబద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కేపీహెచ్‌బీ, దిల్సుఖ్నగర్, ప్రసాద్ మల్టీప్లెక్స్, ఏఎంబీ సినిమాస్లలో ‘మహర్షి’ కోటి గ్రాస్ వసూలు చేయడం విశేషం.
అలాగే వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, ఏలూరు, విజయవాడ, కేపిటల్ సినిమాస్ (విజయాడ), గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, వరంగల్, కరీంనగర్‌లలోనూ ‘మహర్షి’ రూ. కోటి వసూలు చేసింది. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా 11 రోజులకు రూ. 66 కోట్ల షేర్ వసూలు చేసింది.
తెలంగాణలో ఇప్పటికే ఈ సినిమా లాభాల్లోకి వెళ్లగా ఆంధ్రా ఏరియాలో బ్రీకేవెన్ దిశగా అడుగులేస్తోంది. సీడెడ్‌లో నష్టాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఇంకా రూ. 4 కోట్ల షేర్ వస్తే తప్ప బ్రేకీవెన్ కాదు. అది అసాధ్యమని విశ్లేషకులు తేల్చారు. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ. 85 కోట్లు (షేర్) దాటాయి.
21 సెంటర్లలో రూ. కోటి వసూలు చేసిన ‘మహర్షి’ | actioncutok.com