మహర్షి: నైజాంలో ‘రంగస్థలం’ను దాటేసింది!


మహర్షి: నైజాంలో 'రంగస్థలం'ను దాటేసింది!

మహర్షి: నైజాంలో ‘రంగస్థలం’ను దాటేసింది!

మహేశ్ టైటిల్ రోల్ చేసిన ‘మహర్షి’ నైజాం బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది. పూజా హెగ్డే నాయికగా నటించగా, వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తొలి వారానికి సంబంధించి ఇప్పటికే నాన్-బాహుబలి రికార్డును ఖాయం చేసుకుంది. ఇప్పటివరకు తెలంగాణలో తొలి వారానికి సంబంధించి తొలి రెండు రికార్డులు ‘బాహుబలి’ పేరిటే ఉన్నాయి.

‘బాహుబలి 2’ రూ. 35.73 కోట్లు, ‘బాహుబలి’ రూ. 22.59 కోట్ల షేర్లు సాధించగా, రాంచరణ్ ‘రంగస్థలం’ రూ. 16.86 కోట్ల షేర్‌తో మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు కేవలం ఐదు రోజుల్లోనే ‘మహర్షి’ రూ. 18.92 కోట్ల షేర్ సాధించి, ‘రంగస్థలం’ను వెనక్కి నెట్టేసింది. మొదటి వారం పూర్తయ్యే నాటికి ‘మహర్షి’ రూ. 20 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది. కాగా నైజాంలో ‘రంగస్థలం’ పూర్తి వసూళ్లు రూ. 27.70 కోట్లను ‘మహర్షి’ అధిగమిస్తుందో, లేదో చూడాలి.

‘మహర్షి’లోని ‘వీకెండ్ ఫార్మింగ్’ అనే కాన్సెప్ట్ క్రమక్రమంగా పాపులర్ అవుతుండటంతో, ఈ సినిమా చూసేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా ‘మహర్షి’  స్థిరంగా వసూళ్లను సాధించగలుతుతోందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

మహర్షి: నైజాంలో ‘రంగస్థలం’ను దాటేసింది! | actioncutok.com

Trending now: