ఆ జాబితాలో ‘మ‌హ‌ర్షి’ తొమ్మిదోది!


ఆ జాబితాలో 'మ‌హ‌ర్షి' తొమ్మిదోది!

ఆ జాబితాలో ‘మ‌హ‌ర్షి’ తొమ్మిదోది!

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన  మ‌హేశ్ బాబు సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్‌’మ‌హ‌ర్షి’.. ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద పెర్‌ఫార్మ్ చేయ‌క‌పోయినా.. కాస్త స్ట‌డీగానే క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.24 కోట్ల‌కి పైగా షేర్ ఆర్జించిన ‘మ‌హ‌ర్షి’.. రెండో రోజు రూ. 7.8 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

ఇంకా చెప్పాలంటే.. ‘భ‌ర‌త్ అనే నేను’ రెండో రోజు క‌లెక్ష‌న్ల (రూ. 7.5 కోట్లు) కంటే ఇది మెరుగనే చెప్పొచ్చు.  ఇక శ‌నివారం కూడా ఈ సినిమా.. మంచి వ‌సూళ్ళు చూసింద‌ని ట్రేడ్ టాక్‌.

ఇదిలా ఉంటే.. మ‌హేశ్ సినిమాల‌కు వ‌సూళ్ళ ప‌రంగా అడ్డా అయిన యు.ఎస్‌.బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోతోంది. అయితే.. ఎటొచ్చి శ‌నివారం నాటికి ప్ర‌తిష్ఠాత్మ‌క మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరిందీ సినిమా. కాగా.. ఈ జాబితాలో చేరిన మ‌హేశ్ 9వ చిత్రంగా ‘మ‌హ‌ర్షి’ గుర్తింపు తెచ్చుకుంది.

‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’, ‘1 నేనొక్క‌డినే’, ‘ఆగ‌డు’, ‘శ్రీ‌మంతుడు’, ‘బ్ర‌హ్మోత్స‌వం’, ‘స్పైడ‌ర్‌’, ‘భ‌ర‌త్ అనే నేను’ త‌రువాత మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో జాయిన్ అయిన మ‌హేశ్ సినిమా ఇది. ఏదేమైనా.. భారీ మొత్తానికే అక్క‌డ కొనుగోలు చేయ‌బ‌డ్డ ‘మ‌హ‌ర్షి’ బ్రేక్ ఈవెన్ స్టేజ్‌కి చేరుకోవ‌డం క‌ష్ట‌మేనంటున్నారు ట్రేడ్ పండితులు.

ఆ జాబితాలో ‘మ‌హ‌ర్షి’ తొమ్మిదోది! | actioncutok.com

Trending now: