టాలీవుడ్ టాప్ 10లో ‘మహర్షి’

టాలీవుడ్ టాప్ 10లో ‘మహర్షి’
“గెలుపుకునే కోరుకునే వాడు మనిషి.. గెలుపును పంచేవాడు మహర్షి” అనే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. మహేశ్ బాబు సిల్వర్‌జూబ్లీ ఫిల్మ్‌గా రూపొందిన ఈ చిత్రానికి తొలి ఆట నుంచే మిశ్రమ స్పందన వచ్చినా.. వసూళ్ళ పరంగా మాత్రం వార్తల్లో నిలుస్తోంది. ఓవర్సీస్, సీడెడ్‌లో కలెక్షన్స్ వీక్‌గా ఉన్నప్పటికీ.. చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా.. నైజాంలో ఈ చిత్రం మంచి వసూళ్ళు చూస్తోంది.
ఇదిలా ఉంటే.. బుధవారంతో వారం రోజుల ప్రదర్శనను పూర్తిచేసుకున్న ‘మహర్షి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి 2’, ‘బాహుబలి’, ‘రంగస్థలం’ తరువాత నాలుగో స్థానంలో నిలవగా.. ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో నిliచింది. మొదటి నాలుగు స్థానాల్లో ‘బాహుబలి 2’, ‘బాహుబలి’, ‘రంగస్థలం’, ‘ఖైదీ నంబర్ 150’ ఉన్నాయని ట్రేడ్ టాక్.
కాగా.. ఎనిమిదో రోజుకే ‘మహర్షి’ టాలీవుడ్ టాప్ 10లో 9వ స్థానానికి చేరుకుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. మొదటి ఎనిమిది స్థానాలలో ‘బాహుబలి 2’, ‘బాహుబలి’, ‘రంగస్థలం’, ‘ఖైదీ నంబర్ 150’, ‘భరత్ అనే నేను’, ‘అరవింద సమేత’, ‘శ్రీమంతుడు’, ‘ఎఫ్ 2’ ఉండగా.. ప్రస్తుతం ‘మహర్షి’ తొమ్మిదో స్థానంలో ఉంది. పదో స్థానంలో ‘జనతా గ్యారేజ్’ ఉంది.
అంతేకాదు.. సోమవారం నాటికి ‘శ్రీమంతుడు’ వసూళ్ళను ‘మహర్షి’ అధిగమించే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి.. ఫుల్ రన్లో ‘మహర్షి’ ఏ స్థానానికి చేరుకుంటుందో చూడాలి.
టాలీవుడ్ టాప్ 10లో ‘మహర్షి’ | actioncutok.com
More for you: