మహర్షి: ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో చూసిన పూజా హెగ్డే


గురువారం విడుదలైన ‘మహర్షి’ సినిమాని హీరోయిన్ పూజా హెగ్డే, డైరెక్టర్ వంశీ పడిపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ కలిసి ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో తిలకించారు.

మహర్షి: ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో చూసిన పూజా హెగ్డే

మహర్షి: ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో చూసిన పూజా హెగ్డే

మహేశ్ టైటిల్ రోల్ చేసిఏన ‘మహర్షి’ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందు విపరీతమైన అంచనాలు వెల్లువెత్తడంతో అభిమానులు ఈ సినిమా చూసేందుకు థియేటర్ల వద్దకు వెల్లువెత్తారు. తెలంగాణలో నాలుగు ఆటలకు అదనంగా ఇంకో ఆట వేసేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. దాంతో ఉదయం 8 గంటలకే థియేటర్లు ‘మహర్షి’ షోలను మొదలు పెట్టాయి.

కాగా కాస్త పేరున్న హీరో సినిమా అంటే హైదరాబద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ ముందు ఉదయం 8 గంటల నుంచే సందడి మొదలవుతుంది. అక్కడ మొదటి షో 8.45కి మొదలవుతుంది. ‘మహర్షి’ సినిమాకైతే ఉదయం 7.30 నుంచే సందడి మొదలైంది. జన సందోహంతో మల్టీప్లెక్స్ ప్రాంగణం కిటకిటలాడింది. అందుకు తగ్గట్లు యూనిట్ సభ్యులు సినిమాని వీక్షించేందుకు అక్కడికి రావడంతో సందడి మరింత ఎక్కువైంది.

హీరోయిన్ పూజా హెగ్డే, డైరెక్టర్ వంశీ పైడిపల్లి, సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్, గేయరచయిత శ్రీమణి తదితరులు ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని స్క్రీన్ 4లో సినిమాని తిలకించారు. ఈ సందర్భంగా పూజ, వంశీతో దిగిన ఫొటోను దేవి శ్రీప్రసాద్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు.

మహర్షి: ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో చూసిన పూజా హెగ్డే | actioncutok.com

Trending now: