‘రెడ్డిగారి అబ్బాయి’గా కృష్ణగారి అబ్బాయి?

‘రెడ్డిగారి అబ్బాయి’గా కృష్ణగారి అబ్బాయి?
‘మహర్షి’తో కథానాయకుడిగా 25 చిత్రాల మైలురాయికి చేరుకున్న మహేశ్ బాబు.. ఇప్పుడు 26వ సినిమాకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్‌లో సెట్స్ పైకి వెళ్ళనుంది. విజయశాంతి, రమ్యకృష్ణ, జగపతిబాబు.. ఇలా భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోందని ప్రచారం సాగుతోంది.
అంతేకాదు.. టైటిల్స్ విషయంలోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆ మధ్య ‘వాట్సప్’, రీసెంట్గా ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే పేర్లు ఈ సినిమాకి ప్రముఖంగా వినిపించగా.. తాజాగా ‘రెడ్డి గారి అబ్బాయి’ అనే టైటిల్ వెలుగులోకి వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో పాటు కథ రీత్యా ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట.
మరి.. ‘రెడ్డి గారి అబ్బాయి’గానే కృష్ణ గారి అబ్బాయి కనిపిస్తాడా? లేదంటే మరో టైటిల్‌తో వస్తాడా? అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.
‘రెడ్డిగారి అబ్బాయి’గా కృష్ణగారి అబ్బాయి? | actioncutok.com
More for you: