మే 24: ‘సీత‌’ వ‌ర్సెస్ సీత‌!


మే 24: 'సీత‌' వ‌ర్సెస్ సీత‌!

మే 24: ‘సీత‌’ వ‌ర్సెస్ సీత‌!

వచ్చే మే 24కి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అదేమిటంటే.. అదే రోజున తెలుగు తెర‌పైకి రెండు ఇంట్రెస్టింగ్ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ రాబోతున్నాయి. అందులో ఒక‌టి ‘సీత‌’ కాగా.. మ‌రొక‌టి ‘లిసా’ (త్రీడీ ఫిల్మ్). 

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ టైటిల్ రోల్‌లో సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ రూపొందించిన ‘సీత‌’ మే 24న విడుద‌ల కానుండ‌గా.. అదే రోజున ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’లో సీత‌గా మెప్పించిన తెలుగ‌మ్మాయి అంజ‌లి ‘లిసా’గా ప‌ల‌క‌రించ‌బోతోంది. త్రీడీలో రూపొందిన ఈ హార‌ర్ ఫిల్మ్‌కి రాజు విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇలా.. ఒకే రోజున ఇద్ద‌రు టాలెంటెడ్ హీరోయిన్లు బ‌రిలోకి దిగుతుండ‌డంతో.. ఈ రెండు ఫిమేల్ – సెంట్రిక్ మూవీస్‌పై అటు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లోనూ, ఇటు ప్రేక్ష‌క వ‌ర్గాల్లోనూ ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది.  మ‌రి.. ఈ పోటీలో డ‌బ్బు కోసం ఏమైనా చేసే సీత‌గా కాజ‌ల్ మెప్పిస్తుందో.. లేదంటే ‘లిసా’గా భ‌య‌పెట్ట‌నున్న అంజ‌లి మురిపిస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

మే 24: ‘సీత‌’ వ‌ర్సెస్ సీత‌! | actioncutok.com

Trending now: