సూపర్‌స్టార్‌తో సినిమా.. ఒత్తిడిలో డైరెక్టర్!

సూపర్‌స్టార్‌తో సినిమా.. ఒత్తిడిలో డైరెక్టర్!
ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇప్పుడు చెయ్యబోతున్న సినిమా మరో ఎత్తు. అందుకే డైరెక్టర్ అనిల్ రావిపూడి టెన్షన్ పడుతున్నాడు. తన ఐదో సినిమాలో అతను మహేశ్‌ను డైరెక్ట్ చెయ్యనున్నాడు. ఒక సూపర్‌స్టార్‌తో అతడు తొలిసారి పని చేస్తున్నాడు. దాంతో సహజంగానే అతను ఒత్తిడికి లోనవుతున్నట్లు అంతర్గత వర్గాలు చెబ్తున్నాయి.
మహేశ్ త్వరగా కమిట్ కాడు. కథ వినేప్పుడే అది తనకు సరిపోతుందా, హీరో కేరెక్టర్ నప్పుతుందా, లేదా అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత స్క్రిప్టులో తనకు వచ్చిన సందేహాలను అడుగుతాడు. వాటికి సంతృప్తికరమైన సమాధానాలు లభిస్తేనే అతను ఓకే చెప్తాడు.. ఇది అతని సన్నిహితులు చెప్పే మాట.
సుకుమార్‌తో సినిమాను కేన్సిల్ చేసుకున్నా, చాలా కాలం క్రితమే రాజమౌళి కథ చెప్పినా ఆయనకు ఓకే చెప్పకపోవడానికి మహేశ్‌లోని ఈ నిక్కచ్చితనమే కారణమని అంటుంటారు. అలాంటి మహేశ్‌ను తన కథతో ఒప్పించాడు అనిల్.
అతడు చెప్పిన యాక్షన్ కామెడీ మహేశ్‌కు తెగ నచ్చేసింది. ప్రధానంగా అతడు చెప్పిన కామెడీ సన్నివేశాలు మహేశ్‌ని బాగా అలరించాయని తెలిశాయి. కథలో మహేశ్ లేవనెత్తిన ప్రశ్నలకు కూడా అనిల్ టక టకా జవాబులు చెప్పేశాడు.
ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. కథ చెప్పడంతో డైరెక్టర్ పని అయిపోదు. దాన్ని తెర మీదకు ఎలా తీసుకువస్తాడనేదే ప్రధానం. ఇప్పటి దాకా అనిల్ డైరెక్ట్ చేసినవాళ్లంతా ఒక మోస్తరు హీరోలే. ‘ఎఫ్2’లో వెంకటేశ్ వంటి సీనియర్ స్టార్‌ను డైరెక్ట్ చేసినా, ఇప్పుడు ఆయన మార్కెట్ వేరు.
ఇవాళ టాలీవుడ్లో అగ్ర కథానాయకుల్లో మహేశ్ ఒకడు. అతని మారెక్ట్ పరిధి చాలా పెద్దది. టాలీవుడ్‌కు సంబంధించినంత వరకు యు.ఎస్.లో నంబర్ వన్ స్టార్ (అత్యధిక సంఖ్యలో మిలియన్ డాలర్ల సినిమాల నటుడు). అలాంటి అతడిని డైరెక్ట్ చేయబోతున్నాననే ఆలోచన అనిల్‌ను ఓ వైపు ఉద్వేగానికీ, మరో వైపు ఒత్తిడికీ గురి చేస్తోందని అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
జూన్ నుంచి సెట్స్‌పైకి వెళ్తున్న ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచే అనిల్ ప్రిపేర్ అవుతున్నాడు. సన్నివేశాలను ఎలా చిత్రీకరించాలో ప్రణాళికలు వేస్తున్నాడు. మహేశ్‌ను తొలిరోజు డైరెక్ట్ చేసేప్పుడు ఒత్తిడి అనుభవించినా, సెట్స్‌పై అతడు సరదాగా వ్యవహరించే ధోరణితో రెండో రోజు నుంచి ఆ ఒత్తిడి అనిల్లోంచి మాయమవుతుందని మహేశ్ గురించి తెలిసినవాళ్లు చెప్పే మాట.
- సజ్జా వరుణ్
సూపర్‌స్టార్‌తో సినిమా.. ఒత్తిడిలో డైరెక్టర్! | actioncutok.com
Trending now: