‘మిస్టర్ లోకల్’ షూటింగ్ ముగిసింది!


శివ కార్తికేయన్, నయనతార జంటగా నటించిన రెండో సినిమా ‘మిస్టర్ లోకల్’ షూటింగ్ పూర్తి చేసుకొని, మే 17న విడుదలకు సిద్ధమవుతోంది.

'మిస్టర్ లోకల్' షూటింగ్ ముగిసింది!

‘మిస్టర్ లోకల్’ షూటింగ్ ముగిసింది!

నయనతార, శివ కార్తికేయన్ జంటగా నటిస్తున్న ‘మిస్టర్ లోకల్’ షూటింగ్ పూర్తయింది. ఎం. రాజేశ్  డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్ బేనర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఆదివారం (మే 5) షూటింగ్ ముగిసిందంటూ సీనియర్ నటి రాధిక తన ట్విట్టర్ పేజీ ద్వారా తెలిపారు. సినిమాలో ఆమె హీరో తల్లి కేరెక్టర్ చేస్తున్నారు. సెట్స్‌పై హీరో హీరోయిన్లు, డైరెక్టర్‌తో కలిది దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు.

‘వేలైక్కారన్’ తర్వాత శివ, నయనతార కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఇందులో మనోహర్‌గా శివ, కీర్తన వాసుదేవన్‌గా నయనతార కనిపించనున్నారు. యాక్షన్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో నయనతార కేరెక్టర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. మే 17న ఈ సినిమా విడుదలవుతోంది.

‘మిస్టర్ లోకల్’ షూటింగ్ ముగిసింది! | actioncutok.com

Trending now: