మతం: పేరు అడిగి ముస్లిం యువకునిపై కాల్పులు


మతం: పేరు అడిగి ముస్లిం యువకునిపై కాల్పులు

మతం: పేరు అడిగి ముస్లిం యువకునిపై కాల్పులు

బీహార్ : బీహార్ లో కొద్ది కాలంగా స్తబ్దుగా ఉన్న  క్రూరత్వం క్రమంగా పడగ విప్పుతోంది.అందుకు ఓ ముస్లిం యువకునిపై కాల్పులు జరపడమే సజీవ సాక్ష్యం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ ఖాసీం  అనే యువకుడు బెగుసరయ్ జిల్లాలోని కుంభీ గ్రామస్తుడు. చిరు వ్యాపారి. వ్యాపార పనిపై వెళుతున్న ఖాసీంను  రాజీవ్ యాదవ్ అనే వ్యక్తి అడ్డుకుని పేరేమిటని అడిగాడు.

ఖాసీం తన పేరు చెప్పిన వెంటనే కోపం తో ఊగిపోయిన రాజీవ్ యాదవ్ తన దగ్గరున్న తుపాకీతో కాల్పులు జరుపుతూ.. పాకిస్తాన్ వెళ్లిపోవాలంటూ బిగ్గరగా అరిచాడు. తూటా గాయాలతో రక్తమోడుతున్న శరీరంతో ఖాసీం దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసాడు. వెంటనే అప్రమత్తమైన రాజీవ్ యాదవ్ ను వెదకి పట్టుకున్నారు.

ఈ దుర్ఘటనకు  సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని చూసిన  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఖసీమ్‌పై జరిగిన దాడిని ఖండించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మతం: పేరు అడిగి ముస్లిం యువకునిపై కాల్పులు| actioncutok.com

More for you: