నాగ్, సమంత చేసిన ఆ sequel ఆడలేదు.. మరి ఈ sequel?


నాగ్, సమంత చేసిన ఆ sequel ఆడలేదు.. మరి ఈ sequel?

నాగ్, సమంత చేసిన ఆ sequel ఆడలేదు.. మరి ఈ sequel?

మామా కోడళ్లు నాగార్జున, సమంత కలిసి రెండు సినిమాలు చేశారు. అధికారికంగా మామా కోడళ్లు కాక ముందు చేసిన ‘మనం’ మంచి విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం పొంది మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. మామా కోడళ్లయ్యాక ఆ ఇద్దరూ ‘రాజుగారి గది 2’లో నటించారు. mentalist గా నాగ్, ఆత్మగా సమంత నటించిన ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు.

ఇప్పుడు మరోసారి ఆ ఇద్దరూ ‘మన్మథుడు 2’లో నటిస్తున్నారు. నాగ్ జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తోన్న ఈ సినిమాలో సమంత ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. నాగ్ character ను పరిచయం చేసే పాత్రలో సమంత కనిపిస్తుందని వినికిడి. మామగానే కాకుండా వ్యక్తిగానూ నాగ్‌ను అభిమానించే సమంత director రాహుల్ రవీంద్రన్ అడిగిన వెంటనే ఆ కేరెక్టర్ చెయ్యడానికి ఒప్పుకుంది. అన్నట్లు.. సమంత, రాహుల్ మంచి friends కూడా.

ఒక హిట్టు, ఒక బిలో యావరేజ్ మూవీతో ఉన్న నాగ్, సమంత combination మూడోసారి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ‘రాజుగారి గది’కి sequel గా వచ్చిన సినిమా పోయింది కాబట్టి ‘మన్మథుడు’కు sequel గా వస్తున్న సినిమా కూడా సెంటిమెంట్ ప్రకారం అదే రకంగా ఆడుతుందని అంచనా వెయ్యడం కరెక్ట్ కాదు. ఆ సెంటిమెంటును ‘మన్మథుడు 2’ break చేసి, పెద్ద హిట్టవుతుందని ఇటు నాగ్ ఫ్యాన్స్, అటు సమంత అభిమానులూ నమ్ముతున్నారు.

నాగ్, సమంత చేసిన ఆ sequel ఆడలేదు.. మరి ఈ sequel? | actioncutok.com

More for you: