నాని.. మ‌రో క‌ర్ణుడు!


నాని.. మ‌రో క‌ర్ణుడు!

నాని.. మ‌రో క‌ర్ణుడు!

ఈ వేస‌వికి ‘జెర్సీ’తో ప‌ల‌క‌రించిన యువ క‌థానాయ‌కుడు నాని.. ఈ సంవ‌త్స‌రం మ‌రో రెండు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు. వాటిలో ఒక‌టి విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘గ్యాంగ్ లీడ‌ర్‌’ కాగా.. మ‌రొక‌టి త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ రూపొందిస్తున్న ‘వి’. ఈ రెండు సినిమాల్లోనూ ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని పాత్ర‌లు చేస్తున్నాడు నాని.

‘గ్యాంగ్ లీడ‌ర్‌’లో వేర్వేరు ఏజ్ గ్రూప్‌ల‌కు చెందిన ఐదుగురు మ‌హిళ‌ల‌తో క‌ల‌సి దొంగ‌త‌నాలు చేసే యువ‌కుడి పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న నాని.. ‘వి’లో అందుకు భిన్నంగా నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. ఇంకా చెప్పాలంటే.. క‌ర్ణుడి త‌ర‌హా పాత్ర ఇద‌ని తెలుస్తోంది.

మ‌హాభార‌తంలో కర్ణుడు ఎలాగైతే దుర్యోధ‌నుడి స్నేహం కోసం  త్యాగాలు చేస్తుంటాడో.. స‌రిగ్గా అదే పంథాలో ‘వి’లో నాని పాత్ర ఉంటుంద‌ట‌.  తప్పని తెలిసినా ఫ్రెండ్షిప్‌ కోసం తెగించి ముందుకు వెళ్లే ఈ నెగ‌టివ్ ట‌చ్ ఉన్న క్యారెక్ట‌ర్ ప్రేక్షకుల నుంచి సానుభూతి పొందుతుంద‌ని అంటున్నారు. మ‌రి.. కొత్త త‌ర‌హా పాత్ర‌లో నాని ఏ మేర‌కు మెప్పిస్తాడో చూద్దాం.

కాగా.. ‘గ్యాంగ్ లీడ‌ర్‌’ ఆగ‌స్టు 30న రిలీజ్ కానుండ‌గా.. ‘వి’ డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌ కానుంది.

నాని.. మ‌రో క‌ర్ణుడు! | actioncutok.com

More for you: