‘ఫలక్‌నుమా దాస్’ హీరోకు నాని offer!


'ఫలక్‌నుమా దాస్' హీరోకు నాని offer!

‘ఫలక్‌నుమా దాస్’ హీరోకు నాని offer!

కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో ‘ఫలక్‌నుమా దాస్’ అనే సినిమా ఆసక్తి రేపుతోంది. దాని పోస్టర్లు, ప్రమోషన్లు సినీ ప్రియుల్లో మంచి ఇంటరెస్టింగ్‌ను create చేస్తున్నాయి. తమిళంలో హిట్టయిన ‘అంగమలై డైరీస్’ అనే సినిమాకు ఇది remake. విష్వక్సేన్ హీరోగా నటించడమే కాకుండా తానే ‘ఫలక్‌నుమా దాస్’ను direct చేశాడు. ఈ నెల 31న ఈ సినిమా విడుదలవుతోంది.

కాగా సోమవారం ఈ సినిమా pre-release event లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో నాని ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా చూశాననీ, విష్వక్సేన్ నటనకు బాగా impress అయిపోయానన్నాడు. అంతటితో ఆగకుండా నిర్మాతగా తను తియ్యబోయే తదుపరి సినిమాలో విష్వక్సేనే హీరో అని ప్రకటించేశాడు. గతంలో వాల్ పోస్టర్ బేనర్‌పై ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ‘అ!’ సినిమాని నాని నిర్మించిన సంగతి తెలిసిందే.

స్టార్స్ ఎవరూ లేని ‘ఫలక్‌నుమా దాస్’కు US లో ఈ నెల 30న ప్రీమియర్ షోస్ ఏర్పాటు చెయ్యడం గమనార్హం.

‘ఫలక్‌నుమా దాస్’ హీరోకు నాని offer! | actioncutok.com

More for you: