30న ప్రధానిగా మోదీ ప్రమాణం


30న ప్రధానిగా మోదీ ప్రమాణం

30న ప్రధానిగా మోదీ ప్రమాణం

న్యూ ఢిల్లీ :  రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ మే 30 రాత్రి 7 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మోదీతో ప్రమాణం చేయిస్తారు. మోదీతో పాటు పలువురు ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన వెలువరించింది. మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల పేర్లను ప్రకటించలేదు.

ఈసారి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు బోడి మంత్రి వర్గం లో స్థానం లభించ వచ్చని సమాచారం. ఆర్ధిక, హోమ్ , రక్షణ, విదేశీ వ్యవహారాలు వంటి ముఖ్య శాఖల్లో ఒకటి అమిత్ షాకు కట్టబెట్టవచ్చని తెలిసింది. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈసారి ఆ పదవి పీయూష్ గోయల్ ను వరించవచ్చని తెలిసింది.

కాంగ్రేస్ కంచుకోటగా పేరుపొందిన అమేథీలో రాహుల్ గాంధీని మట్టికరిపించిన స్మృతి ఇరానీకి ఈసారి కీలక పదవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మోదీ ప్రభుత్వంలో ఆమె జౌళి, టెక్సటైల్ శాఖ మంత్రిగా పని చేశారు.

30న ప్రధానిగా మోదీ ప్రమాణం | actioncutok.com

More for you: