సీజ‌న్‌కో స్టార్ హీరోతో..!


సీజ‌న్‌కో స్టార్ హీరోతో..!
Nayanthara

సీజ‌న్‌కో స్టార్ హీరోతో..!

అందం, అభిన‌యం, అదృష్టం.. ఈ మూడింటి స‌మ్మేళ‌న‌మే అందాల తార న‌య‌న‌తార‌.  దాదాపు ప‌ద‌హారేళ్ళుగా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ కేర‌ళ బ్యూటీ.. ప్ర‌స్తుతం త‌మిళ‌నాట నంబ‌ర్ వ‌న్ క‌థానాయిక‌గా రాణిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. అక్క‌డ న‌య‌న్ లేడీ సూప‌ర్ స్టార్‌.  అంతేకాదు.. ద‌క్షిణాదిలోనే అత్య‌ధిక పారితోషికం పుచ్చుకుంటున్న క‌థానాయిక‌.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు భాష‌ల్లో బిజీగా ఉంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం.. ఇలా మూడో చోట్లా ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల్లో న‌టిస్తోంది న‌య‌న్‌. వీటిలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో పాటు చిరంజీవి, ర‌జ‌నీకాంత్‌, విజ‌య్ వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఉండ‌డం విశేషం. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ చిత్రాల‌న్నీ పండ‌గ సీజ‌న్ల‌లోనే రాబోతున్నాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. చిరంజీవికి జోడీగా న‌య‌న్ న‌టిస్తున్న తొలి చిత్రం ‘సైరా.. న‌ర‌సింహారెడ్డి’ 2019 విజ‌య‌ద‌శ‌మి కానుకగా విడుద‌ల కానుంటే.. విజ‌య్ కాంబినేష‌న్‌లో న‌టిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని చిత్రం (అట్లీ ద‌ర్శ‌కుడు) ఈ ఏడాది దీపావ‌ళికి రాబోతోంది. ఇక ర‌జ‌నీకాంత్ జంట‌గా న‌టిస్తున్న ‘ద‌ర్బార్‌’ 2020 సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 9న రిలీజ్ కానుంది.

మ‌రి.. సీజ‌న్‌కో స్టార్ హీరో సినిమాతో రాబోతున్న న‌య‌న్‌కి ఈ చిత్రాలు ఎలాంటి ఫ‌లితాల‌ను అందిస్తాయో చూడాలి.

సీజ‌న్‌కో స్టార్ హీరోతో..! | actioncutok.com

More for you: