మెహ్రీన్‌ స్థితి.. అంతేనా! అంతేనా!!


‘ఎఫ్2’ వంటి 2019 బిగ్గెస్ట్ హిట్ చేతిలో ఉన్నా క్రేజీ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలమవుతోంది మెహ్రీన్.

మెహ్రీన్‌ స్థితి.. అంతేనా! అంతేనా!!
Mehreen Pirzada

మెహ్రీన్‌ స్థితి.. అంతేనా! అంతేనా!!

‘ఎఫ్ 2’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చేతిలో ఉన్నా.. సో సో ఆఫ‌ర్ల‌తో సర్దుకుపోతోంది మెహ్రీన్‌. గోపీచంద్, నాగ‌శౌర్య… ఇలా బి, సి గ్రేడ్ హీరోల చిత్రాలే ఇప్పుడు మెహ్రీన్‌కి శ‌ర‌ణ్య‌మ‌వుతున్నాయట‌. ‘హ‌నీ ఈజ్ ద బెస్ట్‌’ అంటూ సంక్రాంతికి విడుద‌లైన ‘ఎఫ్ 2’తో కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకుంది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్‌. వాస్త‌వానికి… ఈ హిట్ కూడా అత్యవ‌స‌ర ప‌రిస్థితుల్లోనే ఆమెకి ద‌క్కింది.

‘కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌’, ‘మ‌హానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’తో హ్యాట్రిక్ హీరోయిన్ అని అనిపించుకోవ‌డ‌మే కాకుండా ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన‌ మెహ్రీన్‌కి.. ఆ త‌రువాత ‘కేరాఫ్ సూర్య‌’, ‘జ‌వాన్‌’, ‘పంతం’, ‘నోటా’, ‘క‌వ‌చం’ రూపంలో బ్యాక్ టు బ్యాక్ స్ట్రోక్స్ త‌గిలాయి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో.. ‘ఎఫ్ 2’ రూపంలో ద‌క్కిన విజ‌యం మెహ్రీన్‌కి గొప్ప ఊర‌ట‌నిచ్చిందనే చెప్పాలి.  అయితే.. ఈ హిట్‌తో క్రేజీ ఆఫ‌ర్లు త‌న‌ని వ‌రిస్తాయ‌న్న  న‌మ్మ‌కంతో కొన్నాళ్ళుగా వెయిటింగ్ మోడ్‌లో ఉన్న ఈ అమ్మ‌డికి.. ఇప్పుడు సో సో ఛాన్స్‌లే ద‌క్కుతున్నాయ‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. 

ఇటీవ‌ల‌ ‘పంతం’ హీరో గోపీచంద్ కాంబినేష‌న్‌ (తిరు ద‌ర్శ‌కుడు)లో ఓ సినిమాకి క‌మిట్ అయిన మెహ్రీన్‌.. తాజాగా నాగ‌శౌర్య హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు తేజ రూపొందించ‌నున్న సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. ‘ఎఫ్ 2’ విజ‌యంలో త‌న పాత్ర నామ‌మాత్ర‌మే అన్న విషయాన్ని కాస్తంత ఆల‌స్యంగా అర్థం చేసుకున్న మెహ్రీన్‌.. ఇప్పుడు త‌న దాకా వ‌స్తున్న అవ‌కాశాల‌ను కాద‌నుకోలేక రాజీ ప‌డుతోంద‌ని ఇన్‌సైడ్ సోర్స్ టాక్‌.

మొత్త‌మ్మీద‌.. ‘ఎఫ్ 2’తో ఘ‌న‌విజ‌యం ద‌క్కినా.. ఆ స‌క్సెస్‌ని అవ‌కాశాలుగా మ‌లుచుకోవ‌డంలో ఈ గ్లామ‌ర్ డాళ్ విఫ‌ల‌మ‌వుతోంది. ప్చ్‌… మెహ్రీన్‌!

మెహ్రీన్‌ స్థితి.. అంతేనా! అంతేనా!! | actioncutok.com

Trending now: