‘బైక్‌’ చుట్టూ టాలీవుడ్‌ స్టోరీ!


'బైక్‌' చుట్టూ టాలీవుడ్‌ స్టోరీ!
A still from RX 100

‘బైక్‌’ చుట్టూ టాలీవుడ్‌ స్టోరీ!

గ‌త ఏడాది సంచ‌ల‌నం ‘ఆర్ ఎక్స్ 100’.. టాలీవుడ్‌లో కొత్త సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టింది. అదేమిటంటే.. బైక్ చుట్టూ తిరిగే క‌థ‌ల‌కు ఊత‌మివ్వ‌డం. స‌ద‌రు సినిమాలో హీరోహీరోయిన్ల ప్రేమ‌కి  ‘ఆర్ ఎక్స్ 100’ బండి  సాక్ష్యంగా నిలుస్తుంద‌న్న సంగ‌తి గుర్తుండే ఉంటుంది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇలానే ‘బైక్‌’ చుట్టూ తిరిగే క‌థ‌ల‌తో అల్లు అర్జున్, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి పాపుల‌ర్ హీరోల‌తో పాటు బ‌డ్డింగ్ హీరోలు కూడా కొత్త చిత్రాలు చేస్తుండ‌డం విశేషం.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ‘ఓ మై ఫ్రెండ్‌’, ‘ఎంసీఏ’ చిత్రాల ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ ‘ఐకాన్‌’ పేరుతో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. రోడ్ జ‌ర్నీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో బైక్ కీ రోల్ ప్లే చేస్తుంద‌ట‌. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌ల్టిలింగ్వ‌ల్ మూవీ ‘హీరో’ కూడా ఇదే త‌ర‌హా బైక్‌ సినిమా అని టాక్‌. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బైక్ రేస‌ర్‌గా క‌నిపిస్తాడు విజ‌య్‌. అంతేకాదు.. ఆ బండి పేరు ‘హీరో’ అని స‌మాచారం.

అలాగే న‌టుడు శ్రీ‌హ‌రి త‌న‌యుడు మేఘాంశ్ హీరోగా ప‌రిచ‌యం కానున్న సినిమా కూడా ‘బైక్‌’ చుట్టూ తిరిగే క‌థాంశంతో తెర‌కెక్కనుంద‌ట‌. ‘రాజ్‌దూత్‌’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి అర్జున్, కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. మున్ముందు.. ఇంకెన్ని ‘బైక్‌’ క‌థ‌లు తెలుగు తెర‌పై సంద‌డి చేస్తాయో చూడాలి మ‌రి.

‘బైక్‌’ చుట్టూ టాలీవుడ్‌ స్టోరీ! | actioncutok.com