నాకు గౌరవమిస్తేనే ‘లక్ష్మీ బాంబ్’ సంగతి చూస్తా!


నాకు గౌరవమిస్తేనే 'లక్ష్మీ బాంబ్' సంగతి చూస్తా!

నాకు గౌరవమిస్తేనే ‘లక్ష్మీ బాంబ్’ సంగతి చూస్తా!

‘కాంచన’ హిందీ రీమేక్ ‘లక్ష్మీ బాంబ్’ డైరెక్షన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కొన్ని రోజుల క్రితం రాఘవ లారెన్స్ ప్రకటించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తనకు మాట మాత్రం చెప్పకుండా సినిమాలో అక్షయ్ కుమార్ లుక్‌ను విడుదల చెయ్యడంతో ఆత్మాభిమానంతో తప్పుకుంటున్నట్లు లారెన్స్ ప్రకటించాడు. అయితే అప్పట్నుంచి అభిమానులు తననే ఆ సినిమాని డైరెక్ట్ చెయ్యమంటూ కోరుతున్నారని లారెన్స్ తెలిపాడు.

“కొన్ని రోజుల క్రితం హిందీ సినిమా ‘లక్ష్మీ బాంబ్’ నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశాను. అప్పట్నుంచీ అక్షయ్ కుమార్ గారి ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ ఆ సినిమాని నన్నే డైరెక్ట్ చేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ల జెన్యూన్ లవ్‌కు చాలా ఆనందమేసింది. కానీ, మీలాగే గత వారం రోజులుగా నేనూ అప్సెట్ అయి ఉన్నానని నమ్మండి. ఈ సినిమా చెయ్యడానికి ఎంతో ఉద్వేగంతో ఉన్నాను.

దీన్ని డైరెక్ట్ చెయ్యడానికి చాలాకాలంగా వేచి చూస్తున్నా. ప్రిప్రొడక్షన్ వర్క్‌కు చాలా సమయం వెచ్చించాను. ఈ సినిమా కోసమే నా డేట్స్ బ్లాక్ చేసి పెట్టాను. రేపు ఈ సినిమా నిర్మాతలు నన్ను కలవడానికి చెన్నై వస్తున్నారు. ఇప్పుడంతా వాళ్ల చేతుల్లోనే ఉంది. నా పనికి తగిన గౌరవం లభిస్తుందంటే అప్పుడు ఆలోచిస్తాను. మీటింగ్ తర్వాత ఏమవుతుందో చూద్దాం. నిజాయితీగా ఈ విషయాన్ని పట్టించుకుంటున్న అభిమానుల కోసం ఈ విషయాన్ని షేర్ చేస్తున్నా” అని శనివారం సాయంత్రం ట్వీట్ చేశాడు లారెన్స్.

దాన్ని బట్టి ఈరోజు నిర్మాతలతో ఆయన మీటింగ్ ఉందన్న మాట. ఆ మీటింగ్ ఫలితం గురించి ఈరోజే లారెన్స్ చెప్పే అవకాశముంది. గమనించదగ్గ విషయమేమంటే ఇంత జరుగుతున్నా అక్షయ్ నుంచి అసలు స్పందన లేకపోవడం. లారెన్స్ బాధను అర్థం చేసుకున్నవాడైతే ఇప్పటికే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఏదో ఒకటి చెప్పి ఉండేవాడు. కానీ ఇప్పటి దాకా ఆ పని ఆయన చెయ్యలేదు.

నాకు గౌరవమిస్తేనే ‘లక్ష్మీ బాంబ్’ సంగతి చూస్తా! | actioncutok.com

More for you: