వరల్డ్‌కప్ క్రికెట్: విండీస్ చేతిలో పాక్‌కు ఘోర పరాభవం


వరల్డ్‌కప్ క్రికెట్: విండీస్ చేతిలో పాక్‌కు ఘోర పరాభవం

వరల్డ్‌కప్ క్రికెట్: విండీస్ చేతిలో పాక్‌కు ఘోర పరాభవం

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను వెస్టిండీస్ చిత్తు చిత్తుగా ఓడించింది. 218 బంతులు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. బంతుల పరంగా వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్‌కు ఇదే అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం. పరుగుల పరంగా చూస్తే ఇది ఆ జట్టుకు రెండో అత్యల్ప స్కోరు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు వెస్టిండీస్ బౌలర్ల ధాటికి 21.4 ఓవర్లలోనే చచ్చీ చెడి 105 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఆరుగులు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. ఓపెనర్ ఫఖర్ జమాన్, మూడో నంబర్ ఆటగాడు బాబర్ ఆజం చేసిన 22 పరుగులే అత్యధికం. ఫాస్ట్ బౌలర్ ఒషేన్ థామస్ 5.4 ఓవర్లలో కేవలం 27 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జాసన్ హోల్డర్ 3, ఆండ్రీ రస్సెల్ 2 వికెట్లు పడగొట్టారు.

106 పరుగుల లక్ష్యాన్ని టీ 20 తరహాలో కేవలం 13.4 ఓవర్లలోనే ఛేదించింది విండీస్ జట్టు. ఈ క్రమంలో 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ క్రిస్ గేల్ చెలరేగి ఆడి 34 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేసి అవుటయ్యాడు. మరో ఓపెనర్ షాయ్ హోప్, డారెన్ బ్రావో విఫలమైనా, నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్ పూరన్ వేగంగా ఆడి 19 బంతుల్లో 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును సునాయాసంగా గెలిపించాడు. ఒషేన్ థామస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

వరల్డ్‌కప్ క్రికెట్: విండీస్ చేతిలో పాక్‌కు ఘోర పరాభవం | actioncutok.com

More for you: