దయనీయ స్థితిలో పవన్ కల్యాణ్


దయనీయ స్థితిలో పవన్ కల్యాణ్

దయనీయ స్థితిలో పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి తెలుగుదేశం పార్టీ కనీస పోటీ ఇవ్వకుండా ఓడిపోవడం ఎంత దిగ్భ్రాంతి కలిగించిందో, పవన్ కల్యాణ్ పార్టీ జనసేన దయనీయ స్థితి చూసి అంత జాలి కలిగించింది. వైఎస్ జగన్ సమ్మోహన శక్తి ముందు కాకలు తీరిన రాజకీయ యోధుడు చంద్రబాబు వ్యూహ చతురత ఎందుకూ కొరగాకుండా పోయింది. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిని రాటు తేలిన ఆయన ఇంకో ఐదేళ్లకి తన పార్టీని ఎలా తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే పనిలో పడిపోతారు.

కానీ పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి? ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో నిల్చోకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతునిచ్చిన పవన్ కల్యాణ్ ఈసారి జనసేనను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడమే ధ్యేయంగా ఎన్నికల బరిలో నిలిచారు. తాను ఒకటి కాకుండా రెండు స్థానాల్లో (గాజువాక, భీమవరం) పోటీ చేశారు. కానీ రెండు చోట్లా ఓటమి పాలై పరువు పోగొట్టుకున్నారు.

సైన్యాన్ని నడిపించే నాయకుడే ఓడిపోతే ఆ సైన్యానికి దిక్కెవరు? కంటి తుడుపు అన్నట్లు రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ ఒక్కడే జనసేన నుంచి గెలిచిన వీరుడయ్యాడు. అతనూ గెలవకుంటే జనసేన ఈ ఎన్నికల్లో సున్నా చుట్టినట్లయ్యేది. అయినప్పటికీ రెండు స్థానాల్లో పోటీ చేసికూడా అసెంబ్లీలో చోటు దక్కించుకోలేకపోయిన పవన్ కల్యాణ్‌లో జన సమ్మోహన శక్తి లేదని తేటతెల్లమైపోయింది.

గతంలో అన్న చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లైనా గెలుచుకుంటే, తమ్ముడు కల్యాణ్ పార్టీ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడిక ‘పవర్‌స్టార్’ కర్తవ్యమేమిటి? అన్న లాగే మళ్లీ సినిమాల్లోకి వచ్చేస్తారా? తమకు రాజకీయాలు అచ్చి రావనీ, సినిమాలే మేలనే అభిప్రాయానికి వస్తారా? చూద్దాం..

దయనీయ స్థితిలో పవన్ కల్యాణ్ | actioncutok.com

More for you: