వాళ్ల మాదిరే ఆ క్రేజీ తార కూడా మూగ, చెవుడు!


వాళ్ల మాదిరే ఆ క్రేజీ తార కూడా మూగ, చెవుడు!
Payal Rajput

వాళ్ల మాదిరే ఆ క్రేజీ తార కూడా మూగ, చెవుడు!

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. Rx 100 తో కుర్ర‌కారుకి కునుకు లేకుండా చేసిన పంజాబీ సొగ‌సు. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగునాట‌ నాలుగు చిత్రాల‌తో బిజీగా ఉంది. ఆ సినిమాలే..’ఆర్ డి ఎక్స్ ల‌వ్‌’, ‘వెంకీ మామ‌’, ‘డిస్కో రాజా’, స్టువ‌ర్ట్‌పురం గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు biopic. వీటిలో ‘డిస్కో రాజా’ కోసం de-glamour పాత్ర‌లో క‌నిపించ‌నుంది పాయ‌ల్‌. ఇంత‌కీ పాయ‌ల్ పోషిస్తున్న‌ పాత్ర ఏమిటంటే.. మూగ‌, చెవిటి అమ్మాయి పాత్ర‌.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. తాజాగా ఇదే త‌ర‌హా పాత్ర‌లో న‌య‌న‌తార‌, త‌మ‌న్నా కూడా న‌టించారు. త‌మిళ చిత్రం ‘కొలైయుదిర్ కాలం’లో న‌య‌న్ మూగ‌, చెవిటి అమ్మాయి క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌గా.. ఆ సినిమా హిందీ వెర్ష‌న్ ‘ఖామోషి’లో త‌మ‌న్నా అదే పాత్ర‌లో న‌టించింది. ఇప్పుడు ఇదే త‌ర‌హా పాత్ర‌లో పాయ‌ల్ న‌టిస్తోంది. కాక‌పోతే.. ‘కొలైయుదిర్ కాలం’, ‘ఖామోషి’ thrillers కాగా.. ‘డిస్కో రాజా’ scientific fiction. మ‌రి.. న‌య‌న్‌, త‌మ‌న్నా వంటి సీనియ‌ర్ హీరోయిన్ల బాట‌లోనే వెళుతున్న పాయ‌ల్‌.. ఈ డిఫ‌రెంట్ రోల్‌లో ఏ మేర‌కు మెప్పిస్తుందో చూద్దాం.

కాగా.. ‘కొలైయుదిర్ కాలం’, ‘ఖామోషి’ జూన్ 14న release కాబోతున్నాయి. ‘డిస్కో రాజా’ ద‌స‌రా సీజ‌న్‌లో విడుద‌ల కానుంది.

వాళ్ల మాదిరే ఆ క్రేజీ తార కూడా మూగ, చెవుడు! | actioncutok.com

More for you: