పాయ‌ల్ ఖాతాలో మ‌రో సీనియ‌ర్ స్టార్?


పాయ‌ల్ ఖాతాలో మ‌రో సీనియ‌ర్ స్టార్?
Payal Rajput

పాయ‌ల్ ఖాతాలో మ‌రో సీనియ‌ర్ స్టార్?

తెలుగు తెర‌పైకి ‘ఆర్ ఎక్స్ 100’ బండిలా దూసుకొచ్చిన అందం పాయ‌ల్ రాజ్‌పుత్‌. గ‌త ఏడాది సంచ‌ల‌నం ‘ఆర్ ఎక్స్ 100’తో కుర్ర‌కారుని ఫిదా చేసిన ఈ హాట్ బ్యూటీ.. ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉంది. ‘ఆర్ ఎక్స్ 100’ త‌రువాత ‘య‌న్‌.టి.ఆర్‌. క‌థానాయ‌కుడు’లో త‌ళుక్కున మెరిసిన పాయ‌ల్‌.. ఈ నెల 24న రిలీజ్‌కి రెడీ అయిన ‘సీత‌’లో ఓ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది. అలాగే.. ‘ఆర్ డి ఎక్స్ ల‌వ్‌’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలోనూ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

వీటితో పాటు మ‌రో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లోనూ భాగ‌మైంది ఈ ఉత్త‌రాది సొగ‌సు. అందులో ఒక‌టి  సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్‌కి జోడీగా న‌టిస్తున్న ‘వెంకీమామ‌’ కాగా.. మ‌రొక‌టి మ‌రో సీనియ‌ర్ హీరో ర‌వితేజ న‌టిస్తున్న ‘డిస్కో రాజా’. ఈ రెండు చిత్రాల్లోనూ న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లోనే క‌నిపించనుంద‌ట పాయ‌ల్‌.

అంతేకాదు.. మ‌రో సీనియ‌ర్ హీరో సినిమాలోనూ పాయ‌ల్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. నంద‌మూరి బాల‌కృష్ణ‌.  ‘జై సింహా’ త‌రువాత కె.య‌స్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ‘రూల‌ర్‌’ అనే పేరు ప్ర‌చారంలో ఉన్న ఈ చిత్రంలో ఇద్ద‌రు క‌థానాయిక‌లకు స్థాన‌ముండ‌గా.. వారిలో ఒక‌రిగా పాయ‌ల్ ఎంపికైంద‌ని టాలీవుడ్ టాక్‌.

మొత్త‌మ్మీద‌.. వ‌రుస‌గా సీనియ‌ర్ హీరోల‌తో క‌మిట్ అవుతూ.. టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతోంది పాయ‌ల్‌.

పాయ‌ల్ ఖాతాలో మ‌రో సీనియ‌ర్ స్టార్? | actioncutok.com

Trending now: