సెక్స్ వర్కర్‌గా క‌వ్వించ‌నున్న‌ ‘ఆర్ ఎక్స్ 100’ స్టార్!


సెక్స్ వర్కర్‌గా క‌వ్వించ‌నున్న‌ 'ఆర్ ఎక్స్ 100' స్టార్!
Payal Rajput

సెక్స్ వర్కర్‌గా క‌వ్వించ‌నున్న‌ ‘ఆర్ ఎక్స్ 100’ స్టార్!

‘ఆర్ ఎక్స్ 100’తో టాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించింది ఉత్త‌రాది భామ పాయ‌ల్ రాజ్‌పుత్‌. సంక్రాంతికి ‘య‌న్‌.టి.ఆర్. క‌థానాయ‌కుడు’లో త‌ళుక్కున మెరిసిన పాయ‌ల్‌.. తాజాగా ‘సీత‌’లో ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది. అయితే.. ఇవేవీ అమ్మ‌డి కెరీర్‌కి ప్ల‌స్ కాలేదు. ఈ నేప‌థ్యంలో.. రాబోయే చిత్రాల‌పైనే త‌న ఆశ‌ల‌న్నీ పెట్టుకుందీ సొగ‌సుల సిరి. 

ఒక‌వైపు ‘ఆర్ డి ఎక్స్ ల‌వ్‌’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో న‌టిస్తూనే.. మ‌రో వైపు సీనియ‌ర్ హీరోలు వెంక‌టేశ్‌, ర‌వితేజ‌తో సినిమాలు చేస్తోంది పాయ‌ల్‌. ‘వెంకీమామ‌’లో వెంకీకి జోడీగానూ, ‘డిస్కో రాజా’లో ర‌వితేజ‌కి జంట‌గానూ న‌టిస్తోంది. అంతేకాదు.. స్టువ‌ర్ట్‌పురం గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న బ‌యోపిక్‌లో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌కి పెయిర్‌గా న‌టిస్తోంద‌ట‌.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ‘డిస్కోరాజా’లోనూ, బ‌యోపిక్‌లోనూ పాయ‌ల్ చేస్తున్న పాత్ర‌లు ఛాలెంజింగ్ రోల్స్ అనే చెప్పాలి. ‘డిస్కో రాజా’లో మూగ‌, చెవిటి అమ్మాయిగా క‌నిపించ‌నున్న పాయ‌ల్.. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్‌లో వేశ్య‌గా న‌టిస్తోంద‌ట‌. మ‌రి.. ఈ ఛాలెజింగ్  రోల్స్‌తో పాయ‌ల్ ఏ మేర‌కు స్కోర్ చేస్తుందో చూడాలి.

సెక్స్ వర్కర్‌గా క‌వ్వించ‌నున్న‌ ‘ఆర్ ఎక్స్ 100’ స్టార్! | actioncutok.com

More for you: