ప్రభాస్ సరికొత్త వ్యూహం

ప్రభాస్ సరికొత్త వ్యూహం
‘బాహుబలి’ సిరీస్ తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు.. ఉత్తరాదిలోనూ తనకంటూ ఓ అభిమానగణాన్ని సంపాదించుకోగలిగాడు ప్రభాస్. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం చేస్తున్న ‘సాహో’, ‘జాన్’ (ప్రచారంలో ఉన్న పేరు) చిత్రాలని తెలుగుతో పాటు హిందీలోనూ సమాంతరంగా ప్లాన్ చేసుకున్నాడు. ఇక్కడితో ఆగిపోకుండా.. ప్రభాస్ మరో అడుగు ముందుకు వేస్తున్నాడట.
అదేమిటంటే.. హిందీ వెర్షన్ ‘సాహో’ కోసం తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడట ప్రభాస్. ఇప్పటికే.. హిందీ మీద పట్టు కోసం రోజుకు ఆరు గంటల పాటు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడని టాక్. పనిలో పనిగా.. సొంత గొంతు వల్ల అక్కడి ప్రేక్షకులకు మరింత చేరువ కావచ్చనే ఉద్దేశంతో.. ‘సాహో’కి డబ్బింగ్ చెప్పే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట ప్రభాస్. ఒకవేళ.. ప్రభాస్ డబ్బింగ్ బాగుంటే అతనితోనే కంటిన్యూ చేస్తారని.. లేదంటే ‘బాహుబలి’ సిరీస్‌కి డబ్బింగ్ చెప్పిన శరద్ కేల్కర్ (‘సర్దార్ గబ్బర్ సింగ్’ విలన్)తో డబ్బింగ్ చెప్పిస్తారని వినిపిస్తోంది.
మొత్తమ్మీద.. ఉత్తరాది భామలు తెలుగువారికి దగ్గర కావాలని పట్టుదలగా డబ్బింగ్ చెప్పుకుంటుంటే.. తెలుగు కథానాయకుడు ప్రభాస్ అందుకు భిన్నంగా ఉత్తరాది వారి మనసు దోచుకోవడానికి డబ్బింగ్ ప్రయత్నం చేస్తుండడం విశేషం.
ప్రభాస్ సరికొత్త వ్యూహం | actioncutok.com
Trending now: