ప్రభాస్ రివీల్ చేసిన ‘సాహో’ పోస్టర్ ఇదే!


ప్రభాస్ రివీల్ చేసిన 'సాహో' పోస్టర్ ఇదే!

ప్రభాస్ రివీల్ చేసిన ‘సాహో’ పోస్టర్ ఇదే!

‘సాహో’ పోస్టర్‌ను ఈరోజు తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ద్వారా రివీల్ చేస్తానని నిన్న చెప్పిన ప్రభాస్.. చెప్పినట్లే ‘సాహో’ పోస్టర్‌ను విడుదల చేశాడు. “Here it is darlings, for all of you… The new official poster of my next film ‘Saaho’. See you in theaters on 15th August!” అని దానికి క్యాప్షన్ జోడించాడు.

ఆ పోస్టర్‌లో కళ్లకు ప్రత్యేకమైన గాగుల్స్ పెట్టుకొని ఏదో ఒక ఆపరేషన్‌లో పాల్గొనేందుకు తగ్గ కాస్ట్యూమ్స్ వేసుకున్న ప్రభాస్ ఒక్కడే కనిపిస్తున్నాడు. అది కూడా మొత్తం కనిపించకుండా క్లోజప్‌లో తల భాగం, మెడని దాచేస్తున్న కాస్ట్యూమ్స్‌తో సీరియస్ లుక్‌లో ఉన్నాడు ప్రభాస్.

‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రానికి ‘రన్ రాజా రన్’ ఫేం సుజీత్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు, హిందీ, తమిళ భాషల్లో తయారవుతున్న ఈ సినిమాలో నాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది.

‘సాహో ’ని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌రిస్తున్నారు.

బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను… స్టార్ రైటర్ అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 15న చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రభాస్ రివీల్ చేసిన ‘సాహో’ పోస్టర్ ఇదే! | actioncutok.com