పాలిటిక్స్: అన్నిటా విఫల ప్రధాని!


గతంలో ప్రధాన మంత్రులుగా చేసినవాళ్లు ఏదో ఒక విషయంలోనైనా సఫలమయ్యారనీ, కానీ అన్ని విషయాల్లోనూ విఫలమైన ప్రధాని ఒక్క నరేంద్ర మోదీయేననీ చంద్రబాబు విమర్శించారు.

పాలిటిక్స్: అన్నిటా విఫల ప్రధాని!
Chandrababu

పాలిటిక్స్: అన్నిటా విఫల ప్రధాని!

అమరావతి: దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఈ 72 సంవత్సరాల్లో ప్రధాని పీఠం అధిష్టించిన వారిలో అన్నిటా విఫల ప్రధాని ఒక్క నరేంద్ర మోదీనే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా మోదీ పాలన శైలిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల కష్ట సుఖాలపై ఏ మాత్రం బాధ్యత లేని ప్రధాని మోదీయేననీ పత్రికలూ వ్యాఖ్యానించాయన్నారు.

మోదీ పాలనలో ఏనాడూ లేనంతగా అంత:కలహాలు చెలరేగాయని చంద్ర బు ఆరోపించారు. నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. మోదీ పాలనలో బ్యాంకింగ్ రంగంపై ప్రజలకున్న నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారని బాబు విమర్శించారు.

ఏటీఎంలను దిష్టిబొమ్మలుగా మార్చారని, జీఎస్టీ అమలులో ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. మోదీ పాలనలో రూపాయి విలువ దారుణంగా పతనమయిందని బాబు ఆరోపించారు.

పాలిటిక్స్: అన్నిటా విఫల ప్రధాని! | actioncutok.com

Trending now: